అవి హీరోయిన్లను బాధించవు | Rakul preet singh interview | Sakshi
Sakshi News home page

అవి హీరోయిన్లను బాధించవు

Oct 30 2015 8:13 AM | Updated on Aug 28 2018 5:11 PM

అవి హీరోయిన్లను బాధించవు - Sakshi

అవి హీరోయిన్లను బాధించవు

ప్రస్తుతం టాలీవుడ్‌లో నటి రకుల్‌ప్రీత్ సింగ్ క్రేజ్ సహ నటీమణులకు సెగలు పుట్టిస్తోందంటే నమ్మండి.

చెన్నై : ప్రస్తుతం టాలీవుడ్‌లో నటి రకుల్‌ప్రీత్ సింగ్ క్రేజ్ సహ నటీమణులకు సెగలు పుట్టిస్తోందంటే నమ్మండి. కుర్రకారు కథా నాయకులందరూ ఇప్పుడు ఈ అమ్మడినే కోరుకుంటున్నారు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్‌టీఆర్‌లతో జత కడుతున్న రకుల్‌ప్రీత్  తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేసిందనే ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ పక్కన పెట్టిన రకుల్‌ప్రీత్‌ని టాలీవుడ్ అందలం ఎక్కించేస్తోంది. దీంతో యమజోష్‌లో ఉన్న ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో హద్దులు దాటేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవి ఈ అమ్మడి చెవిని తాకడంతో ఏ విధంగా స్పందించిందో చూడండి.

‘గ్లామర్‌కు అశ్లీలానికి చిన్న గీత మాత్రమే ఉంటుంది. దాన్ని నేనెప్పెడూ దాటే సాహసం చేయను. ఇక నా కొత్త అందాల గురించి మాట్లాడుతున్నారు. ఈ అందం కోసం ఒక ప్రముఖ శిక్షకుడి వద్ద ప్రత్యేక శిక్షణ పొందాను. నాలోని కొత్త అందాలకు కారణం ఇదే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే మంచి జోరు మీద ఉన్న ఈ బ్యూటీకి రామ్‌చరణ్‌తో నటించిన బ్రూస్‌లీ చిత్రం బ్రేక్ వేసిందనే ప్రచారం పెద్ద షాక్‌నే ఇచ్చిందట. అయినా దాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తూ  జయాపజయాలు హీరోయిన్లను బాధించవు అంటూ మేకపోతు గంభీరాన్ని ఒలకపోస్తూ హీరోయిన్‌గా నా పయనం కొనసాగుతుందని అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement