బన్నీతో చిందేస్తుందట | priyamani special song in bunny upcoming movie | Sakshi
Sakshi News home page

బన్నీతో చిందేస్తుందట

Sep 23 2015 8:56 AM | Updated on Sep 3 2017 9:51 AM

బన్నీతో చిందేస్తుందట

బన్నీతో చిందేస్తుందట

నేషనల్ అవార్డు సాధించిన హీరోయిన్గా సౌత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది.

నేషనల్ అవార్డు సాధించిన హీరోయిన్గా సౌత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. నటిగా మంచి మార్కులే సాధిస్తున్నా, సినిమాను సక్సెస్ బాటలో నడిపే సక్సెస్ఫుల్ హీరోయిన్గా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయింది. మంచి నటనతో పాటు గ్లామర్ షోకు కూడా వెనుకాడకపోయినా ఈ అందాల భామకు అదృష్టం మాత్రం కలిసి రావటం లేదు.

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించినా, ఒక్క యమదొంగ తప్ప ప్రియమణి కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఇక కెరీర్ ముగిసిపోయినట్టే అనుకున్న సమయంలో షారూఖ్ హీరోగా తెరకెక్కిన 'చెన్నై ఎక్స్ప్రెస్' సినిమా ఈ అమ్మడికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ప్రియమణి సౌత్తో పాటు నార్త్ ఆడియన్స్ దృష్టిని కూడా ఆకర్షించింది.

ప్రస్తుతం లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టిపెట్టిన ఈ భామ, మంచి ఛాన్స్ కొట్టేసింది. వరుస బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న అల్లు అర్జున్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్న 'సరైనోడు' సినిమాలో ఐటమ్ సాంగ్ కు రెడీ అవుతోంది. బన్నీ లాంటి ఎనర్జిటిక్ స్టార్ పక్కన చిందేస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది ప్రియమణి. మరి బన్నీ అయినా ప్రియమణి కెరీర్ ను గాడిలో పెడతాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement