పనైపోయిందోచ్‌... | Pooja Hegde About Aravinda Sametha Veera Raghava First Schedule | Sakshi
Sakshi News home page

పనైపోయిందోచ్‌...

Jun 9 2018 12:33 AM | Updated on Aug 22 2019 9:35 AM

Pooja Hegde About Aravinda Sametha Veera Raghava First Schedule - Sakshi

..అంటున్నారు పూజా హెగ్డే. అదేంటీ పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. అప్పుడే పనైపోయింది అంటున్నారేంటి? అని పూజా హెగ్డే ప్రేమ పూజారులు కంగారుపడొద్దు. పనైపోయింది ప్రస్తుతానికే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత.. వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా రీసెంట్‌ షెడ్యూల్‌కు పూజా బైబై చెప్పారు.

హైదరాబాద్‌లోని అల్యుమీనియం ఫ్యాక్టరీలో జరిగిన ఈ షెడ్యూల్‌లో పూజాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారట దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. నాలుగు రోజులు జరిగిన ఈ షెడ్యూల్‌కు గురువారం ప్యాకప్‌ చెప్పారు పూజా. ఈ షెడ్యూల్‌ గురించి పూజా మాట్లాడుతూ – ‘‘ప్రతీరోజూ సెట్‌కి రావడం భలే సరదాగా ఉండేది. కొత్త షెడ్యూల్‌ కోసం ఎదురు చూస్తున్నాను. తారక్‌ (ఎన్టీఆర్‌) ఇందులో (షెడ్యూల్‌) మీరు మిస్‌ అయ్యారు. నెక్ట్స్‌ టైమ్‌ ష్యూర్‌గా కలుద్దాం’’ అని పేర్కొంటూ దర్శకుడు త్రివిక్రమ్, కెమెరామ్యాన్‌ పీయస్‌ వినోద్‌తో దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేశారు పూజా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement