పోర్న్‌స్టార్‌ దత్తత తీసుకోవడమేమిటి? | Netizens question Sunny leone on adoption of girl child | Sakshi
Sakshi News home page

పోర్న్‌స్టార్‌ దత్తత తీసుకోవడమేమిటి?

Jul 23 2017 12:01 PM | Updated on Sep 5 2017 4:43 PM

పోర్న్‌స్టార్‌ దత్తత తీసుకోవడమేమిటి?

పోర్న్‌స్టార్‌ దత్తత తీసుకోవడమేమిటి?

చిన్నారి నిషా( 21 నెలల వయసు)ను సన్నీ లియోన్‌ దంపతులు దత్తత తీసుకోవడంపై సోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

ముంబై:  చిన్నారి నిషా( 21 నెలల వయసు)ను సన్నీ లియోన్‌ దంపతులు దత్తత తీసుకోవడంపై సోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సన్నీ దంపతులు నిషాను దత్తత తీసుకున్న విషయాన్ని మోడల్‌ మోడల్‌ షెర్లిన్‌ చోప్రా ట్వీటర్‌ ద్వారా బయటపెట్టారు. అది మొదలు బాలీవుడ్‌ నటీనటుల నుంచి సన్నీకి పెద్ద ఎత్తున అభినందలు రావడం మొదలెట్టాయి.

అయితే, సోషల్‌మీడియాలో మాత్రం సన్నీకు భిన్నమైన గొంతు వినిపిస్తోంది. కొందరు నెటిజన్లు సన్నీ.. ఓ పోర్న్‌స్టార్‌ చిన్నారిని దత్తత తీసుకుంటుంటే ప్రభుత్వం ఎలా వూరుకుంది అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు గుప్పించారు. చిన్నారిని కూడా పోర్న్‌స్టార్‌గా మారుస్తుందంటూ చేతికొచ్చిన కామెంట్లు పెడుతున్నారు.

ఈ వ్యాఖ్యలపై పలువురు సెలెబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని దత్తత తీసుకున్నప్పుడు అభినందించాల్సింది పోయి ఓ యువతికి ఆమె గతాన్ని గుర్తుచేస్తూ బాధపెట్టడం సరికాదంటూ తప్పుబడుతున్నారు. కాగా, సోషల్‌మీడియా దుమారంపై ఇంకా సన్నీ స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement