‘మంచి లక్షణాలు ఉ‍న్న అబ్బాయి’ వచ్చాడు | MLA Theatrical Trailer Released | Sakshi
Sakshi News home page

‘మంచి లక్షణాలు ఉ‍న్న అబ్బాయి’ వచ్చాడు

Mar 16 2018 6:44 PM | Updated on Mar 16 2018 6:46 PM

MLA Theatrical Trailer Released - Sakshi

ఎంఎల్‌ఏ ట్రైలర్‌లో కళ్యాణ్‌ రామ్‌ (యూట్యూబ్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : ‘మా ఊళ్లో నన్ను అందరూ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అంటారు. అందుకే షార్ట్‌ ఫాంలో ఎంఎల్‌ఏ అంటారు’ అంటూ తన లేటెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు శుక్రవారం దూసుకొచ్చింది. కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ఎంఎల్‌ఏ.

‘ఏ మామగారైనా పిల్లతో పాటు కట్నం ఇస్తారు. మా మామగారేంటో నాకు బామ్మర్దిని ఇచ్చారు’ అంటూ వెన్నెల కిషోర్ దీనంగా చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ‘పిల్లలకు ఆస్తులిస్తే అవి ఉంటేనే బతుకుతారు. అదే చదివిస్తే ఎలాగైనా బతుకుతారు’ అని కాజల్‌ పలికే సంభాషణ ఆలోచింపచేసేలా ఉంది.

‘ఎంఎల్‌ఏగా గెలవాలంటే సినిమా డైలాగ్‌లు చెప్పడం, చిందులు వేయడంకాదు’ అని ప్రతినాయకుడు డైలాగ్‌ విసిరితే.. ‘నేను ఇంకా రాజకీయం చేయటం మొదలు పెట్టలేదు. మొదలుపెడితే మీరు చేయడానికి ఏమీ మిగలదు’ అని కల్యాణ్‌రామ్‌ చెబుతున్న పవర్‌ఫుల్‌ డైలాగ్‌ అభిమానులను సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement