నాన్న తన సొంత పేరుతో నటిస్తున్నారా: మంచు లక్ష్మీ

Manchu Laxmi Said I Don't Know My Father Used His Birth Name - Sakshi

డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు నుంచి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు మంచు లక్ష్మీ. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా విలక్షణ గొంతుతో అభిమానులకు చేరువయ్యారు. ఇటీవలే తన కూతురుతో కలిసి యూట్యూబ్‌లో ‘చిట్టి చిలకమ్మ’ అనే ఛానల్‌ పెట్టిన లక్ష్మీ.. పిల్లల పెంపకంపై వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఆమె తన తండ్రి మోహన్‌ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హీరో సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘భక్త వత్సలం నాయుడు’. ఇది ఆయన అసలు పేరు కావడం విశేషం. తెలుగుతోపాటు, తమిళంలోనూ మోహన్‌బాబు తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం మరో విశేషం. ఈ విషయాన్ని ఓ నెటిజన్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. దీనిపై మంచు లక్ష్మీ స్పందించారు. నాన్న తన సొంత పేరుతో సినిమాలో నటిస్తున్నాడని ఇప్పటికీ తెలియదంటూ పేర్కొన్నారు. ‘ఓహ్‌ నాన్న తన పుట్టిన పేరును సినిమాలో ఉపయోగించాడని నాకు తెలియదు. యూనిఫామ్‌లో నాన్న ఎంత అందంగా ఉన్నాడో. మా నాన్న ఓ అద్భుతం.’ అంటూ ట్వీట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top