చిన్మయి నిషేధంపై స్టే

Madras High Court Stays Dubbing Unions Ban On Chinmayi - Sakshi

మీటూ ట్వీట్లతో కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాదకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ విధించిన నిషేధంపై హైకోర్టు స్టే ఇచ్చింది. గత ఏడాది మీటూ ఆరోపణల నేపథ‍్యంలో తమిళ డబ్బింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాధా రవిపై చిన్మయి తీవ్ర ఆరోపణలు చేశారు.

రాధరవి చాలా సందర్భాల్లో మహిళపై దుర్భాషలాడారని ఆరోపించారు. దీంతో కొద్ది రోజుల్లోనే చిన్మయిపై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ నిషేధం విధించింది. ఈ ఘటనపై  చిన్మయి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిషేధంపై స్టే విధించటం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్మయి ‘కోర్టు నా మీద విధించిన నిషేధంపై స్టే ఇచ్చింది. కానీ ఇంకా చేయాల్సిన పోరాటం చాలా ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది’ అంటూ ట్వీట్ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top