17ఏళ్ల తర్వాత...

Kareena Kapoor Khan and Karan Johar to team up again - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ మరోసారి కరణ్‌ జోహార్‌ చిత్రంలో నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో 2001లో వచ్చిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా కపూర్‌ తొలిసారి కరణ్‌ దర్శకత్వంలో నటించారు. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, జయా బచ్చన్, షారుఖ్‌ ఖాన్, హృతిక్‌ రోషన్, కాజోల్‌ కూడా ఆ చిత్రంలో నటించారు.

ఆ తర్వాత నిఖిల్‌ అద్వానీ దర్శకత్వంలో కరణ్‌ నిర్మించిన ‘కల్‌ హో నా హో’ చిత్రంలో ప్రీతి జింతా స్థానంలో తొలుత కరీనాను సంప్రదించారట. అయితే, ఆమె భారీ రెమ్యునరేషన్‌ అడగటంతో ఆ ప్రాజెక్టు మిస్‌ చేసుకున్నారని బాలీవుడ్‌ టాక్‌. తాజాగా కరణ్‌ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో కథానాయికగా కరీనా నటించనున్నారని బీ టౌన్‌ ఖబర్‌. అంటే.. దాదాపు 17ఏళ్ల తర్వాత కరణ్‌–కరీనా కలిసి పనిచేయనున్నారన్నమాట. ధర్మా ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రూపొందనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top