అలాంటి అనుభవాలు మాకే లభిస్తాయి : కాజల్‌ | Kajal Agarwal Talk About Indian 2 Movie | Sakshi
Sakshi News home page

నా మనసు సున్నితం

May 22 2019 8:04 AM | Updated on Aug 8 2019 11:13 AM

Kajal Agarwal Talk About Indian 2 Movie - Sakshi

చెన్నై : నా మనసు సున్నితమైనది అని చెప్పుకొచ్చింది హిరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. అపజయాలు జయానికి సోపానాలు అంటారు. అది  కాజల్‌అగర్వాల్‌ విషయంలోనూ వర్తిస్తుంది. మొదట్లో తమిళం, తెలుగు భాషల్లో అపజయాలతోనే కాజల్‌ అగర్వాల్‌ సినీ జీవితం మొదలైంది. ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ అగ్రనటి స్థాయికి చేరుకుంది. కాజల్‌అగర్వాల్‌ తరువాత ఆమె చెల్లెలు నిశా అగర్వాల్‌ కూడా నటిగా అక్క బాటలో పయనించినా, అది అతి కొద్ది చిత్రాలకే పరిమితమైంది. ఆ తరువాత పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అయ్యింది. కాజల్‌ అగర్వాల్‌ మాత్రం కథానాయకిగా తన హవాను కొనసాగిస్తోంది.

ప్రస్తుతం తెలుగులో నటించిన సీత చిత్రం శుక్రవారం తెరపైకి రానానుంది. ఇక హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో జయంరవికి జంటగా కోమాలి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర వర్గాలు ఇటీవలే విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాగా కమలహాసన్‌కు జంటగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2లో నటించే అవకాశాన్ని కాజల్‌ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. నటుడు కమలహాసన్‌ రాజకీయాలతో బిజీ కావడంతో ఇండియన్‌–2 చిత్ర నిర్మాణం వాయిదా పడింది. ఎన్నికల పర్వం పూర్తి కావడంతో కమలహాసన్‌ త్వరలో ఇండియన్‌–2కు రెడీ అవుతున్నారు.

ఈ విషయం గురించి నటి కాజల్‌అగర్వాల్‌ మాట్లాడుతూ..  తాను ఈ రంగంలో 15 ఏళ్లుగా నటిస్తున్న తనకు ఎన్నో చిత్రాలు, పాత్రలు మనసును హత్తుకున్నాయని చెప్పింది. దర్శకుడు కథ చెప్పగానే అందులోని కథానాయకి పాత్రలో తనను ఊహించుకుంటానని అంది. అలా ఒక్కో పాత్ర కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నట్లు ఉంటుందని చెప్పింది. ఇలాంటి అనుభవాలు కళాకారులకు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఒక్కో కథ, కథా పాత్ర ఆశ్చర్యం, ఆనందం వెత్యాసమైన అనుభవాలను కలిగిస్తాయని చెప్పింది. ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఆయా ప్రాతల ప్రభావం తనపై ఉంటుందని, అయితే అలా పాత్రల్లో నుంచి బయటపడకపోతే ఇతర కథా పాత్రలకు న్యాయం చేయడం సాధ్యం కాదని అనుభవపూర్వకంగా తెలిసి రావడంతో ఇప్పుడు పాత్రల ప్రభావం నుంచి బయటపడడం నేర్చుకున్నానని చెప్పింది. తన మనసు చాలా సున్నితమని, అయితే కోపం ఎక్కువ అని అంది. ప్రేమ కూడా ఎక్కువగానే కురిపిస్తానని చెప్పింది. తాను మొదట్లో ఎలా ఉన్నానో, ఇప్పటికీ అలానే ఉన్నానని అంది.  కాగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే అంటే జూన్‌లోనే కమలహాసన్‌కు జంటగా నటించనున్న ఇండియన్‌ 2 చిత్రం ప్రారంభం కానుందని కాజల్‌ అగర్వాల్‌ పేర్కొంది. కాగా ఈ బ్యూటీ ఇటీవల అందాలారబోసే విధంగా ఫొటో సెషన్‌ చేయించుకుని ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement