
ఊహించని క్లైమాక్స్...
‘‘ప్రస్తుతం చిన్న చిత్రాల హవా వీస్తోంది. కొత్త తరహా చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. సాలూరి రాజేశ్వరరావు వారసుడిగా నన్నెలా
‘‘ప్రస్తుతం చిన్న చిత్రాల హవా వీస్తోంది. కొత్త తరహా చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. సాలూరి రాజేశ్వరరావు వారసుడిగా నన్నెలా ఆదరించారో, సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న మా అబ్బాయికి కూడా మీ ఆశీస్సులు ఉండాలి. ఎవరూ ఊహించని విధంగా ఉండే ఈ చిత్రం క్లైమాక్స్ కచ్చితంగా ప్లస్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. సిద్ధాంశ్, అక్షర జంటగా జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మించిన చిత్రం ‘గాయకుడు’. కమల్.జి దర్శకుడు. ఈ శుక్రవారం చిత్రం విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘మంచి టీమ్‌తో వర్క్ చేశానన్న సంతృప్తి ఉంది. రోషన్ ఇచ్చిన నాలుగు పాటలు చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని రోషన్ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నిర్మాతగా నాకిది తొలి సినిమా అయినా ఎక్కడా రాజీపడలేదు. అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్‌తో పనిచేశాను. చాలా సంతృప్తిగా ఉంది’’ అన్నారు.