
గతేడాది డిసెంబర్‌లో హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనస్‌తో ప్రియాంకా చోప్రా వివాహం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె గర్భవతి అనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇందుకు తగ్గట్లుగానే ప్రియాంకా చోప్రాకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. ఆ ఫొటోలో ప్రియాంక ‘బెల్లీ బంప్’తో కనిపించారని చూసినవాళ్లు అంటున్నారు. దాంతో గర్భవతి అని ప్రచారం మొదలైంది. ప్రియాంకా చోప్రా తల్లి ఈ విషయంపై స్పందించారు. ‘‘అంతా ఉత్తుత్తుదే.
మా అమ్మాయి తల్లి కాబోతుందన్న వార్త పుకారు మాత్రమే. నేను నా కూతురితో మాట్లాడాను. అలాంటిది ఏం లేదు. అందుకు కాస్త టైమ్ కావాలని చెప్పింది. ప్రస్తుతం హీరోయిన్‌గా, నిర్మాతగా తను బిజీగా ఉంది. కెమెరా యాంగిల్ సరిగా లేకపోవడం వల్లే ప్రియాంక కాస్త బొద్దుగా కనిపించి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంక తల్లి మధు చోప్రా.