శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు.. | Bigg Boss 3 Telugu: Sye Raa Remix Song For Sreemukhi | Sakshi
Sakshi News home page

శ్రీముఖి కోసం సైరా రీమిక్స్‌ సాంగ్‌..

Nov 1 2019 3:47 PM | Updated on Nov 1 2019 7:23 PM

Bigg Boss 3 Telugu: Sye Raa Remix Song For Sreemukhi - Sakshi

బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున ప్రతీ ఇంటి సభ్యుడికి ఒక్కో క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో లౌడ్‌ స్పీకర్‌ అన్న క్యాప్షన్‌ను శ్రీముఖికి ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌ టాప్‌ లేచిపోయేలా అరుస్తుంది. అయితే ఈ అల్లరి అరుపులతో శ్రీముఖికి అభిమానులు సొంతమయినట్టే ఇదేం గోల అని ముఖం తిప్పుకునేవారూ లేకపోలేరు. ఇప్పటిదాకా టైటిల్‌ కోసం ఇంటి సభ్యులు ఎన్నో ఫీట్లు చేశారు. ఇప్పుడు వారి అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా హోరాహోరీ ప్రచారాలతో ఓట్ల యుద్ధానికి దిగారు. ఫలితం నిర్ణయించడానికి నేడే ఆఖరి రోజు కానుండటంతో ప్రచారాన్ని మరింత ఉదృతం చేశారు. ఇప్పటికే శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో వినూత్న ప్రచారానికి దిగింది.

వరుణ్‌ కోసం అభిమానులు ఓ పాటతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇదే ఫార్ములాను శ్రీముఖి అభిమానులు ఫాలో అయ్యారు. ఇందుకోసం లేటెస్ట్‌ మూవీ ‘సైరా’ను వాడుకున్నారు. సైరా టైటిల్‌ సాంగ్‌ను శ్రీముఖి కోసం పేరడీ చేశారు. బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్‌ఫుల్‌ లైన్‌లతో హోరెత్తించారు. ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలికారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో సాగిన జర్నీని ప్రతిబింబించేలా వీడియోను రూపొందించారు. ఇది చూసిన అభిమానులు నూతనోత్సాహంతో ఓట్లు గుద్దిపడేస్తున్నారు. ఎవరెన్ని పోరాటాలు చేసినా గెలుపు ఒక్కరిదే. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఓటింగ్‌లో దూసుకుపోతుండగా వీరిమధ్యే ప్రధాన పోటీ నెలకొంది. దీంతో ఎవరు టైటిల్‌ను ఎగరేసుకుపోతారనేది సస్పెన్స్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement