హౌస్‌మేట్స్‌ ముసుగు తీసేద్దాం : నాగ్‌

Bigg Boss 3 Telugu Nagarjuna Hosting Fourth Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కొందరు ముసుగు వేసుకుని నటిస్తారన్న సంగతి తెలిసిందే. బయట సమాజంలో ముసుగు వేసుకుని నటించడంలో కొందరు విజయవంతమవుతారు. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లో మాత్రం అలా కుదరదు. చుట్టూ 64 కెమెరాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఏదో సందర్భంలో ఇంటి సభ్యుల అసలు రంగు బయటపడక మానదు. ఇప్పటికే కొందరు హౌస్‌మేట్స్‌ తమ స్ట్రాటజీలను ఉపయోగిస్తూ.. గేమ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఇదే విషయాన్ని నేడు కింగ్‌ నాగార్జున బయట పెట్టేందుకు ప్రయత్నిద్దామని తెలిపారు. హౌస్‌మేట్స్‌ అసలు రంగు.. వారు వేసుకున్న ముసుగును తొలగిద్దామని అన్నారు. మరి ఈ వారంలో ఇంటి సభ్యులు మిగతా హౌస్‌మేట్స్‌ గురించి మాట్లాడుకోవడం, వారి దగ్గర ఓ మాట.. వేరే వారి ద​గ్గర ఓ మాట మాట్లాడటం.. గ్రూపులు కట్టి మిగతా వారి గురించి మాట్లాడుకోవడం చూస్తునే ఉన్నాం. అయితే వీటన్నంటిపై నేటి ఎపిసోడ్‌లో నాగ్‌ ఓ లుక్‌ వేయబోతున్నాడు. కెప్టెన్సీ టాస్క్‌లో పునర్నవి పార్టిసిపేట్‌ చేయకుండా ఈగలు కొట్టుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్‌మీడడియాలో లెక్కలేనన్ని మీమ్స్‌ హల్‌చల్‌ చేశాయి. ఈ విషయంపై పునర్నవిని నాగ్‌ మందలించాడు. ఇక శ్రీముఖి విషయంలో రాహుల్‌ వైఖరిపై నాగ్‌ ఫైర్‌ అయ్యాడు. గత వారం హౌస్‌మేట్స్‌పై నిప్పులు చెరిగిన నాగ్‌.. ఈ సారి కూడా వారిని హెచ్చరించేట్టు కనపడుతున్నాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top