ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

Bigg Boss 3 Telugu Fourth Week Elimination - Sakshi

బిగ్‌బాస్‌ను చూస్తున్న ప్రేక్షకులకు గడిచిన మూడు వారాల్లో రాని విసుగు నాల్గో వారంలో వచ్చేసింది. నామినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి గొడవలు జరగకపోవడం.. కెప్టెన్సీ టాస్క్‌ సైతం తేలిపోవడం.. డ్రాగన్స్‌ చేజిక్కించున్న అలీరెజా, రవికృష్ణ, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కూడా ఆకట్టుకోలేకపోయారు. సింహాసనంపై కూర్చున్న అలీరెజాను దింపడంలో హౌస్‌మేట్స్‌ వినూత్న ప్రయత్నాలేవీ చేయలేదు. 

ఎంతసేపు అలీ మీద కూర్చోడం, సింహాసనం పక్కనే ఉండటం తప్ప చేసిందేమీ లేదు. ఒంటి చేత్తో రవికృష్ణ కాసేపు పోరాడగా.. పెద్ద పెద్ద మాటలు చెప్పిన రాహుల్‌.. కొద్దిసేపు మాత్రమే పోరాడి చేతులెత్తేశాడు. చివరకు అలీరెజా సులభంగా కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఈ టాస్క్‌లో కొద్దిలో కొద్దిగా వరుణ్‌ కొత్తగా ట్రై చేశాడు. నీళ్లు తెచ్చి సింహాసనానికి రక్షణగా ఉన్నవారిపై పోయడం లాంటివి చేశాడు. బక్రీద్‌, స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగ అంటూ హౌస్‌మేట్స్‌ సంబరాలు చేసుకున్నారు. కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయారు. ఈ వారం మొత్తంగా బిగ్‌బాస్‌ ఫెయిల్‌ అయినట్టు కనిపిస్తోంది.

అయితే కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే.. ఎలిమినేషన్‌ ప్రక్రియ. ఈ సారి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బిగ్‌బాస్‌ ఇంట్లోనూ ఈ టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. శ్రీముఖి అనాలిసిస్‌ చేసి.. ఈవారం రోహిణి ఎలిమినేట్‌ కానుందని తేల్చిచెప్పింది. దీంతో కుంగిపోయిన రోహిణి కంటతడి పెట్టుకుంది. అయితే బయట కూడా ఇలాంటి అనాలిసిస్సే జరుగుతోంది. ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న వారందరిలో రాహుల్‌, శివజ్యోతి, రోహిణికి తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఓటింగ్‌ విషయంలో ఈ ముగ్గురు చాలా తక్కువ వ్యత్యాసంలో ఉన్నట్లు సమాచారం. (‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’)

అయితే ముగ్గురికి సమాన ఓట్లు వస్తుండటంతో సోషల్‌ మీడియాలో ఓ క్యాంపైన్‌ కూడా నడిచింది. మీకు నచ్చని కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కావాలి అనుకుంటే.. మిగతా ఇద్దరికీ సమాన ఓట్లు వేయండంటూ ప్రచారం జరిగింది. మరోవైపు ఈ సారి డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందనే వార్త కూడా వైరల్‌ అవుతోంది. మొత్తానికి ఈ వారం ఏది జరిగినా అది పెద్ద సర్‌ప్రైజ్‌గానే ఉంటుందనేది మాత్రం వాస్తవం. ఇంతవరకు ఎలాంటి నెగెటివిటీ లేకుండా నెట్టుకొట్టుస్తున్న రోహిణి.. హౌస్‌లో నిత్యం కంటతడి పెడుతూ పాతాళగంగగా పేరు తెచ్చుకున్న శివజ్యోతి.. పునర్నవి వ్యవహారంతో క్రేజ్‌ తెచ్చుకున్న రాహుల్‌ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉండటం.. ఈ వీకెండ్‌ను మరింత ఆసక్తికరంగా మలచనుంది. చూడాలి మరి.. ఈ వారం బిగ్‌బాస్‌ ఇంటిని ఎవరు వీడనున్నారో?.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

17-09-2019
Sep 17, 2019, 13:23 IST
తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్‌ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్‌లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్‌ కొన్ని మార్పులు...
17-09-2019
Sep 17, 2019, 11:38 IST
బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.....
17-09-2019
Sep 17, 2019, 11:07 IST
గత సీజన్లలో వచ్చిన నామినేషన్‌ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌ మక్కీకి మక్కీ దించాడు. ఇక ఇంటిసభ్యులందరూ ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడానికి అరక్షణమైనా ఆలోచించకుండా ఒకరికోసం...
17-09-2019
Sep 17, 2019, 10:01 IST
ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్‌, రెండు...
17-09-2019
Sep 17, 2019, 08:34 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం...
16-09-2019
Sep 16, 2019, 22:50 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారంలో చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠగా మారింది.  ఈ క్రమంలో గార్డెన్‌ ఏరియాలో ఓ...
16-09-2019
Sep 16, 2019, 20:06 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్‌లోకి...
16-09-2019
Sep 16, 2019, 18:05 IST
గత సీజన్‌లో ఇచ్చిన టాస్క్‌లనే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. రెండో సీజన్‌లో  నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా...
16-09-2019
Sep 16, 2019, 17:21 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో.. నామినేషన్‌లో ఉండటం అనేది ఎంతటి వారికైనా కునుకు లేకుండా చేస్తుంది. హౌస్‌మేట్స్‌లో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు...
15-09-2019
Sep 15, 2019, 22:23 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వీకెండ్‌ సందడిగా గడిచింది. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు....
15-09-2019
Sep 15, 2019, 20:26 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు వచ్చేసింది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో అందరి లెక్కలు సరిచేసిన నాగ్‌.. విశ్వరూపం చూపించాడు....
14-09-2019
Sep 14, 2019, 22:58 IST
బిగ్‌బాస్‌ను ఎదురించిన పునర్నవి, మహేష్‌లపై నాగ్‌ ఫైర్‌ అవ్వడం, శ్రీముఖికి వార్నింగ్‌ ఇవ్వడం, టాస్క్‌లను అర్థం చేసుకుని ఆడాలని శిల్పాకు...
14-09-2019
Sep 14, 2019, 19:33 IST
బిగ్‌బాస్‌ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఇచ్చాడో కానీ హౌస్‌ మొత్తం గందరగోళంగా మారింది. దెయ్యాలు...
14-09-2019
Sep 14, 2019, 19:06 IST
బిగ్‌బాస్‌లో ఎనిమిదో వారం సందడిగానే గడిచింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఒకెత్తు...
14-09-2019
Sep 14, 2019, 17:07 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారంలో కొందరు ఇంటిసభ్యులు తిరుగుబాటు చేశారు. బిగ్‌బాస్‌ ఆదేశాలనే ధిక్కరించారు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
14-09-2019
Sep 14, 2019, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ అనేది ఎంత ఉత్కంఠగా సాగాల్సి ఉంటుందో.. అందుకు భిన్నంగా జరుగుతూ వస్తోంది. మొదటి వారం...
13-09-2019
Sep 13, 2019, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్‌ ఐటమ్స్‌ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్‌ లభించాయి....
13-09-2019
Sep 13, 2019, 18:00 IST
అవును మహేష్‌ను బిగ్‌బాస్‌ ఎలిమినేట్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరూ నమ్మేలా మహేష్‌ సీక్రెట్‌ టాస్క్‌ చేయాలి. అసలే...
13-09-2019
Sep 13, 2019, 17:08 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్‌ ఇవ్వాలన్నా.. సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వాలన్నా.. అలాంటి...
13-09-2019
Sep 13, 2019, 16:17 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top