భారత్-పాక్ మ్యాచ్కు కామెంటేటర్గా అమితాబ్ | Amitabh Bachchan to make his commentary debut at this World Cup | Sakshi
Sakshi News home page

భారత్-పాక్ మ్యాచ్కు కామెంటేటర్గా అమితాబ్

Feb 14 2015 4:34 PM | Updated on Sep 2 2017 8:41 PM

భారత్-పాక్ మ్యాచ్కు కామెంటేటర్గా అమితాబ్

భారత్-పాక్ మ్యాచ్కు కామెంటేటర్గా అమితాబ్

బాలీవుడ్ బిగ్ బీ,సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ కార్యక్రమం ద్వారా అభిమానులను అరలించిన అమితాబ్.. ప్రపంచకప్లో కామెంటేటర్గా మన ముందుకు రానున్నారు.

నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనూ ఉత్కంఠే. ఆదివారం జరిగే భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్లో అమితాబ్ తొలిసారిగా కామెంటేటర్గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు కపిల్దేవ్, షోయబ్ అక్తర్, హర్షబోగ్లే వంటి దిగ్గజాల సరసన అమితాబ్ కామెంటేటరీ చెప్పనున్నారు. తన షమితాబ్ చిత్రానికి ప్రమోషన్ గానే ఆయన కామెంట్రీ చెబుతారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement