చరణ్‌కు బిగ్‌ బీ శుభాకాంక్షలు | Amitabh Bachchan Sends Special Wishes to Ram Charan | Sakshi
Sakshi News home page

చరణ్‌కు బిగ్‌ బీ శుభాకాంక్షలు

Mar 27 2019 11:47 AM | Updated on Mar 27 2019 12:00 PM

Amitabh Bachchan Sends Special Wishes to Ram Charan - Sakshi

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్‌ కు విషెస్‌ తెలుపుతూ అమితాబ్ రిలీజ్ చేసిన వీడియో సందేశాన్ని ఉపాసన తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా చరణ్‌ తనకు 18 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని ఎప్పటికీ అలాగే ఉండాలని ఆకాంక్షించారు అమితాబ్‌. చివరగా తెలుగులో చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తన సందేశాన్ని ముగించారు.

గత ఏడాది ఇదే రోజు సైరా టీంతో జాయిన్‌ అయిన అమితాబ్‌, చరణ్‌కు సెట్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమితాబ్‌ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement