శాకాహారం..కల సాకారం! | Amala Paul open Vegan & Vegetarian Restaurant | Sakshi
Sakshi News home page

శాకాహారం..కల సాకారం!

Apr 18 2017 11:48 PM | Updated on Sep 5 2017 9:05 AM

శాకాహారం..కల సాకారం!

శాకాహారం..కల సాకారం!

‘సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి’ అంటూ మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాలో సందేశం చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

‘సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి’ అంటూ మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాలో సందేశం చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే బాటలో నడవాలని అందాల భామ అమలాపాల్‌ డిసైడ్‌ అయ్యారట. అందుకే చెన్నైలో ‘వేగన్‌’ రెస్టారెంట్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. వేగన్‌ అంటే తెలిసే ఉంటుంది. జంతు ఉత్పత్తులేవీ తినరు. చివరికి పాలు కూడా తాగరు. పూర్తిగా శాకాహారమే తీసుకుంటారు. ఆరోగ్యానికి మంచిది కాబట్టి, ‘వేగన్‌’ రెస్టారెంట్‌ని ప్రారంభించాలను కుంటున్నారామె.

వీలు చూసుకుని తన కలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారు. అంతే కాదు... యోగా, మెడిటేషన్‌ కేంద్రాలను కూడా మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ ఉందట. ప్రతి సంవత్సరం ఎన్నో అనుకుంటున్నా వర్క్‌ అవుట్‌ కావడం లేదని, ఈసారి ఎలాగైనా చేసి తీరతానని ఆమె గట్టిగా చెబుతున్నారు. జీవితం చాలా అందమైనదని, చూసే కన్నుల్లోనే తేడా ఉంటుందని, పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ సవ్యంగా సాగుతాయని అంటున్నారామె. ఆరోగ్యకరమైన లైఫ్‌ను లీడ్‌ చేసేందుకు, క్రమశిక్షణగా మెలిగేందుకు ఇష్టపడతానని అమలాపాల్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement