పవన్‌ కల్యాణ్‌పై బన్నీ కామెంట్‌ | Allu Arjun Supported Pawan Kalyan In Social Media | Sakshi
Sakshi News home page

Jun 7 2018 10:30 AM | Updated on Mar 22 2019 5:33 PM

Allu Arjun Supported Pawan Kalyan In Social Media - Sakshi

పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌కు మధ్య కాస్త దూరం తగ్గిపోయింది. ‘చెప్పను బ్రదర్‌’ ఎపిసోడ్‌ తరువాత పవన్‌ ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌ను సోషల్‌ మీడియాలో ఏ రేంజ్‌లో ట్రోల్‌ చేశారో అందరికి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి ఉదంతం అనంతరం బన్నీ పవన్‌కు సపోర్ట్‌గా నిలవడంతో ఈ ఇద్దరి మధ్య దూరం తగ్గింది. బన్నీ ‘నా పేరు సూర్య’ మూవీ సక్సెస్‌మీట్‌కు పవన్‌ ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది. 

అయితే తాజాగా బన్నీ పవన్‌ను ఉద్దేశించి సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. రాజకీయంగా పవన్‌ ఎదుర్కొంటున్న విమర్శల్ని గురించి తన కామెంట్‌ ద్వారా వ్యక్త పరిచారు. ‘నువు​ నీ పిచ్చితో ఉంటే... ప్రపంచమే సర్దుకుపోతుంది’ అంటూ పవన్‌ ఫోటోను షేర్‌ చేశారు. ఇంత మంది మెగా హీరోలు ఉన్నా కూడా ఒం‍టరిగానే నిలబడ్డారు పవన్‌ కల్యాణ్‌. ఏ ఒక్కరి సహాయాన్ని పవన్‌ కోరడం లేదు. సమయం వచ్చినప్పుడల్లా మెగా హీరోలే స్పందించి మేము ఎప్పుడైనా పవన్‌ వెంట నడవడానికి సిద్ధమే అంటూ చెప్పుకొస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement