
కర్నూలు, బేతంచెర్ల: వానర, మార్జాలం జాతి వైరం మరిచి స్నేహంగా మెలుగుతూ కుల, మత భేదాల కారణంగా కొట్టుకు చస్తున్న మనుషులకు స్ఫూర్తిగా నిలిచాయి. జాతి వైరాలు తమకు లేవంటూ సఖ్యతగా మెలుగుతున్న ఈ రెండు మూగ జీవులు బేతంచెర్ల శిరిడి సాయిబాబా ఆలయం వద్ద గురువారం ఇలా సాక్షి కెమెరాకు దొరికాయి. వీటి మధ్య చక్కటి స్నేహం కుదరడంతో ఎక్కడికెళ్లినా ఒకదాని వెంట ఒకటి వెళ్తుండడం విశేషం. రెండు, మూడు రోజులుగా అవి రెండు కలిసి ఉంటున్నాయని స్థానికులు మెకానిక్ లోకేష్, శివారెడ్డి, అంజి తెలిపారు.