అమెరికా ఎన్నికల ప్రచార ఖర్చు ఎంతంటే? | US presidential candidates spent $2.17 billion on election campaign: Study | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికల ప్రచార ఖర్చు ఎంతంటే?

Dec 29 2016 8:53 AM | Updated on Apr 4 2019 5:04 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు, వారికి మద్దతు ఇచ్చిన సంస్థలు సుమారు రూ.14,803 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది.

వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు, వారికి మద్దతు ఇచ్చిన సంస్థలు సుమారు రూ.14,803 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. అమెరికా ఎన్నికల సంఘం, పన్ను సంస్థలు, ఇతర నివేదికల గణాంకాలు విశ్లేషించి ‘ది సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంటెగ్రిటీ’ అనే సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది.

నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, అతనికి మద్దతు ఇచ్చిన సంస్థలు రూ.2,789 కోట్లకు పైగా ఖర్చు చేయగా ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ రూ.2592 కోట్లకుపైగా వెచ్చించారు. డెమోక్రటిక్‌ అభ్యర్థిత్వం కోసం హిల్లరీతో పోటీపడిన బెర్నీ శాండర్స్‌ రూ.1582 కోట్లు, రిపబ్లికన్‌ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ట్రంప్‌కు సవాలు విసిరిన ట్రెడ్‌ క్రూజ్‌ రూ.1,098 కోట్లు వెచ్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement