ధ్యానం, డైరీ రాయడమే కాపాడుతోంది

Melania Sibbit Shares Her Experience After Corona Diseased - Sakshi

ఏదో పది రోజులు సెలవులు వచ్చాయి కదా ఎంచక్కా పడవెక్కి అమెరికా చూసి రావచ్చనుకొని కెనడా నుంచి కొందరు బయల్దేరారు. గ్రాండ్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌లో ఎంజాయ్‌ చేయాలని వెళ్లారు. హవాయి దీవుల నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళుతుండగా ఆ నౌకలో ఉన్నవారిపై కరోనా దాడి చేసిందని తెలిసింది. ఒక్కసారిగా నీరసం ఆవహించేసింది. ఆ నౌకలో కెనడా విక్టోరియాకు చెందిన మహిళ ఒకరు ఉన్నారు. మెలానియా సిబ్బిట్‌ అనే మహిళ నౌకలో తొలి కరోనా బాధితురాలు.

కానీ ఆమె నిరాశా నిస్పృహలకు లోనుకాలేదు. అమెరికాలో ట్రెంటన్‌ రేవులో నౌకను నిలిపి ఉంచి ఒక్కో అంతస్తులో కొందరిని విడివిడిగా ఉంచారు. మూడు పూటలా ఆహారం, దుస్తులు సరఫరా చేస్తున్నారు. మనిషి ముఖమే కనిపించకపోతే టైమ్‌ గడవడం లేదని ఎవరికైనా విసుగు వస్తుందేమో కానీ మెలానియా ఎప్పటికప్పుడు తనని తాను ఉత్సాహంగా ఉంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి రోజూ వ్యాయామం, ధ్యానం చేస్తున్నారు. తన రోజువారీ కార్యక్రమాన్ని డైరీగా రాస్తున్నారు. మరో వారం, పది రోజులు మెలానియా ఇతర వ్యాధిగ్రస్తులు నిర్బంధంలో గడపాల్సి ఉంటుంది. ఒక సినిమా హాలులో ఉన్నట్టుంది, లైఫ్‌ని రియల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నానంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ అందరిలోనూ ధైర్యం నింపుతున్నారు మెలానియా. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top