ఒలింపిక్స్ ప్రైజెస్ అన్నీ ఈ గడుగ్గాయిలకేనేమో! | may These Amazing Tinys are Future Olympians | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్ ప్రైజెస్ అన్నీ ఈ గడుగ్గాయిలకేనేమో!

Aug 14 2016 3:14 PM | Updated on Jul 26 2018 5:23 PM

ఒలింపిక్స్ ప్రైజెస్ అన్నీ ఈ గడుగ్గాయిలకేనేమో! - Sakshi

ఒలింపిక్స్ ప్రైజెస్ అన్నీ ఈ గడుగ్గాయిలకేనేమో!

ఓ పక్క రియోడిజనిరో హోరాహోరీగా ప్రపంచ క్రీడల సంగ్రామం (ఒలింపిక్ గేమ్స్) జరుగుతూ ప్రపంచ మొత్తాన్ని కోలాహలంలో ఉంచగా అచ్చం అలాంటి క్రీడలతో ఉన్న ఓ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.

ఓ పక్క రియోడిజనిరో హోరాహోరీగా ప్రపంచ క్రీడల సంగ్రామం (ఒలింపిక్ గేమ్స్) జరుగుతూ ప్రపంచ మొత్తాన్ని కోలాహలంలో ఉంచగా అచ్చం అలాంటి క్రీడలతో ఉన్న ఓ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. అక్కడ ఒలంపిక్స్ దాదాపు 20 ఏళ్లు పైబడిన వారు ఆ గేమ్స్ ఆడుతుండగా మనకు ఈ ఆన్ లైన్ లో దర్శనం ఇస్తున్న వీడియోల్లో కనిపించే క్రీడలు ఆడేవాళ్లంతా రెండు నుంచి మూడేళ్లలోపువారే. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమే..

ఫేస్ బుక్ లో ఓ వీడియోలో 2-3 ఏళ్లలోపు చిన్నారులు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. స్వయంగా తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణలో వారు ఈ విధంగా రాటుదేలారు. అందులో బ్యాక్ఫ్లిప్స్ జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, ఫ్రీస్టైల్  స్విమ్మింగ్ వంటివి కళ్లకు కూడా అందనంతా వేగంగా చేస్తున్నారు. వీళ్లకు నిజంగా ఇప్పుడు అవకాశం ఇస్తే ఒలింపిక్స్ బహుమతులన్నీ కొల్లగొట్టేస్తారేమో అనే అనుమానం కూడా రాక మానదు. అంత అద్భుతంగా వాళ్లు నేర్చుకున్న ఆయా క్రీడల్లో ఈ బుడతలు ప్రదర్శన ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement