యజమాని కోసం మూడేళ్ల నిరీక్షణ | dog waited for owner 3years | Sakshi
Sakshi News home page

యజమాని కోసం మూడేళ్ల నిరీక్షణ

Jun 10 2017 3:00 PM | Updated on Sep 29 2018 4:26 PM

యజమాని కోసం మూడేళ్ల నిరీక్షణ - Sakshi

యజమాని కోసం మూడేళ్ల నిరీక్షణ

కుక్కకుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు.

కుక్కకుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియాలోని బూసన్‌ నగరంలోని ‘ఫూ సీ’ అనే ఎనిమిదేళ్ల కుక్క మరోసారి రుజువు చేసింది. ఈ ఊరకుక్కను కొన్నేళ్ల క్రితం ఓ వద్ధురాలు చేరదీసింది. ముద్దుగా పూ సీ అని పేరు పెట్టుకుంది. కొంతకాలం ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ఆ వద్ధురాలికి డిమెన్షియా జబ్బు రావడంతో వైద్యులు వచ్చి ఆమెను నర్సింగ్‌ హోమ్‌కు తరలించారు.
ఈ విషయం పూ సీకి తెలియదు. ఆ వద్ధురాలి ఇంట్లో కూడా ఎవరూ ఉండరు. దీంతో ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఇంటి ముందుకొచ్చి ఆ వద్ధురాలి కోసం పూ సీ ఎదురు చూసేది. ఇరుగు పొరుగు వారు పడేసే ఆహారాన్ని తింటూ ఆ ఇంటి పరిసరాల్లోనే గడిపేది. అలా మూడేళ్లు గడిచినా పూ సీ తన నిరీక్షణను ఆపలేదు. దాంతో ఇరుగుపొరుగు వారే కుక్కల సంరక్షణ కేంద్రానికి ఫోన్‌ చేశారు. వారొచ్చి కుక్కను పరీక్షించగా దాని ఆరోగ్యం కూడా పాడయింది. దానికి సరైన వైద్య చికిత్సను అందించడంతో తిరిగి కోలుకుంది. యజమానురాలు కోసం పూ సీ నిరీక్షణ గురించి స్థానిక మీడియాలో వార్తలు రావడంతో మరో కుటుంబం ఆ కుక్కను దత్తత తీసుకుంది. స్కై అని ఆ కుక్కకు పేరు మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement