మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశమయ్యారు.
టోక్యో: మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశమయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, అమరావతి వద్ద మిజుహో బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తే దేశంలో ప్రధాన బ్యాంక్ కార్యాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాల పై మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో ఏపీ సర్కార్ ఎంఓయూ చేసుకుంది. అనంతరం సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసాయోషిసూన్తో చంద్రబాబు భేటీ అయ్యారు.