చందమామపై చక్కని ఊరు | A nice town on the moon | Sakshi
Sakshi News home page

చందమామపై చక్కని ఊరు

May 1 2017 1:37 AM | Updated on Sep 5 2017 10:04 AM

చందమామపై చక్కని ఊరు

చందమామపై చక్కని ఊరు

చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపించడమే కష్టం. అలాంటిది ఏకంగా అక్కడ ఓ గ్రామాన్నే నిర్మిస్తామంటున్నారు చైనా,

లండన్‌: చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపించడమే కష్టం. అలాంటిది ఏకంగా అక్కడ ఓ గ్రామాన్నే నిర్మిస్తామంటున్నారు చైనా, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) అంతరిక్ష శాస్త్రవేత్తలు. స్పేస్‌ టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు సుదూర అంతరిక్షయానానికి చంద్రుడిని కేంద్రంగా మారుస్తామని వారు ప్రకటించారు.

అంతేకాదు చంద్రుడిపై అపారంగా ఉన్న హీలియంను తవ్వడానికి సైతం ప్రణాళికలు వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విషయమై ఈయూ ప్రతినిధి పాల్‌ విస్ట్సేన్‌థాల్‌ మాట్లాడుతూ, అంతరిక్ష పరిజ్ఞానం గత 60 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వాడుకోవడం కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తామని పాల్‌ తెలిపారు. ఈయూతో జరిగిన చర్చల్ని చైనా స్పేస్‌ ఏజెన్సీ ప్రధాన కార్యదర్శి తియాన్‌ యూలుంగ్‌ సైతం ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement