టీఆర్ఎస్ ఎల్పీలో వైఎస్సార్సీ ఎల్పీ విలీనం | ysrclp Merger in trslp | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఎల్పీలో వైఎస్సా ర్సీ ఎల్పీ విలీనం

May 7 2016 4:30 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్‌ఎస్ ఎల్పీలో కలపాలంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్ తమను టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ అందించారు. దానిని పరిశీలించిన స్పీకర్... వారిని టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. శాసనసభలో వారికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిపి సీట్లు కేటాయించాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి రాజ సదారాం శుక్రవారం బులెటిన్ విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement