సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకొని ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతామంటూ ముందుకు వచ్చిన కళాశాలల యాజమాన్యాలు ఫీజు భయంతో వెనక్కి తగ్గాయి.
సొంత పరీక్ష అవసరంలేదని లేఖలు
సాక్షి, హైదరాబాద్: సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకొని ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతామంటూ ముందుకు వచ్చిన కళాశాలల యాజమాన్యాలు ఫీజు భయంతో వెనక్కి తగ్గాయి. సొంతంగా పరీక్ష నిర్వహించుకునే కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వబోమని ప్రభుత్వం పేర్కొనడంతో తమకు పరీక్ష అవసరం లేదని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీకి లేఖలు అందజేశాయి.