దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు | Today, the final verdict in the case of Dilsukhnagar explosions | Sakshi
Sakshi News home page

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు

Dec 13 2016 9:35 AM | Updated on Oct 2 2018 4:13 PM

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు - Sakshi

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది.

హైదరాబాద్ సిటీ: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులోని ఆరుగురు నిందితులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్‌, తహసీన్‌ అక్తర్‌, జియ ఉర్‌ రహమాన్‌, ఎజాజ్‌ షేక్‌లను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా పేలుళ్ల సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నాడు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు వారు నమోదుచేశారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement