
తెలంగాణ కొత్త జిల్లాల కలెక్టర్లు వీరే
తెలంగాణలో కొత్త జిల్లాల సంబురం మొదలైంది. ఇప్పటికే బతుకమ్మ, దసరా పండుగలతో ప్రజలంతా సంతోషంగా గడుపుతుండగా వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియకు శరవేగంగా కదులుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో కలెక్టర్ల నియామకానికి సంబంధించిన కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న 21 జిల్లాలకు ఎవరిని నియమించాలనే విషయంలో రూపొందించిన జాబితాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు.
ఈ నియామకాలకు సంబంధించి రాత్రి పొద్దుపోయిన తర్వాత అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కొత్త జిల్లాలకు ఈ కింద పేర్కొన్న జాబితా ప్రకారం కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్వల్ప మార్పులతో తుది జాబితా అర్ధరాత్రి దాటిన తర్వాత వెలువడే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రాథమిక సమాచారం మేరకు కొత్త జిల్లాల కలెక్టర్ల వివరాలు...
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా అమ్రపాలి
యాదాద్రి జిల్లా- అనితా రామచంద్రన్
మహబుబాబాద్ జిల్లా- ప్రీతిమీనన్
మెదక్ జిల్లా- భారతి హోలికేరి
జయశంకర్ జిల్లా -మురళి
జిగిత్యాల జిల్లా-శరత్
ఆదిలాబాద్ జిల్లా-జ్యోతి బుద్ధప్రసాద్
జోగులాంబ జిల్లా -రజత్ కుమార్
నిర్మల్ జిల్లా-ఇలంబర్తి
ఆసిఫాబాద్ జిల్లా-చంపాలాల్
వనపర్తి జిల్లా-శ్వేతా మహంతి
నాగర్ కర్నూల్ జిల్లా- ఇ.ధర్
వికారాబాద్ జిల్లా-దివ్య
మల్కాజ్గిరి జిల్లా-ఎంవీ రెడ్డి
వరంగల్ రూరల్ జిల్లా-ప్రశాంత్
సిద్ధిపేట జిల్లా-వెంకట్రామిరెడ్డి
సూర్యాపేట జిల్లా-సురేంద్ర మోహన్
రాజన్న సిరిసిల్ల జిల్లా-కృష్ణ భాస్కర్
పెద్దపల్లి జిల్లా-అలుగు వర్షిణి
కామారెడ్డి జిల్లా-సత్యనారాయణ