ఫీజుల వసూళ్లపై నిర్దిష్ట విధానం | Specific policy on fees collection | Sakshi
Sakshi News home page

ఫీజుల వసూళ్లపై నిర్దిష్ట విధానం

Apr 12 2016 4:05 AM | Updated on Sep 3 2017 9:42 PM

రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఇష్టానుసారం సాగుతున్న ఫీజుల వసూళ్లపై నియంత్రణకు వారం రోజుల్లో విధానపర నిర్ణయాన్ని ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ప్రైవేటు పాఠశాలల్లో అమలుకు చర్యలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఇష్టానుసారం  సాగుతున్న ఫీజుల వసూళ్లపై నియంత్రణకు వారం రోజుల్లో విధానపర నిర్ణయాన్ని ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

 జీవో నంబరు 1 ప్రకారం ఏం చేయాలంటే..
 ప్రభుత్వం 1994లో జారీ చేసిన జీవో నంబరు 1 ప్రకారం.. ఒక పాఠశాలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం మొత్తాన్ని 100 శాతం అనుకుంటే.. అందులో 50 శాతం  ఉపాధ్యాయుల వేతనాలకు వెచ్చించాలి. మరో 15 శాతంతో పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పన చేపట్టాలి. మరో 15 శాతం నిధులను నిర్వహణకు వెచ్చిం చాలి. మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం ఉపయోగించాలి. యాజమాన్యం 5 శాతాన్ని మాత్రమే లాభంగా తీసుకోవాలి. ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు.

అధికారుల కమిటీ తనిఖీల్లో ఇది బయట పడింది. దానిపై ఇపుడు పక్కా విధానం రూపకల్పనకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు ఫీజులను ఖరారు చేసేలా ఏఎఫ్‌ఆర్‌సీ తరహా సంస్థను ఏర్పాటు చేయాలని గతంలో భావించింది. ప్రస్తుతం దానిని పరిశీలించడంతోపాటు జీవో నంబరు 1 ప్రకారమే ఆదాయ వ్యయాలను లెక్కించేలా, పాఠశాల వారీగా ఫీజులను నిర్ణయించేలా చర్యలు చేపట్టేందుకు  కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement