మనస్తాపంతో నవ వరుడు ఆత్మహత్య | New groom Commits suicide with depression | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో నవ వరుడు ఆత్మహత్య

Aug 28 2016 6:22 PM | Updated on Nov 6 2018 8:04 PM

కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్‌ జంగయ్య బస్తీలో మహేశ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వివాహ సమయంలో అత్తింటి వారితో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటన వివరాలు ఎస్‌ఐ అజేయ్‌కుమార్,కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం బోరబండ ఇంద్రానగర్ జంగయ్య బస్తీలో నివాసం ఉంటున్న ఎ.మహేష్ (24)కు అడ్డగుట్టకు చెందిన స్వప్నతో 5 నెలల కిత్రమే వివాహం జరిగింది.

 

పెళ్లి సమయంలో ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య గొడవ చోటుచేసుకుంది.అప్పటి నుంచి తరుచూ గొడవలు జరుగుతూ ఉన్నాయని,భార్య మహేష్‌తో సరిగా ఉండేది కాదని సోదరుడు పెద్ది తెలిపాడు.దీంతో తీవ్ర మనస్థాపం చెందుతూ వస్తున్న మహేష్ చివరిసారిగా ఉదయం 10.30 గంటల సమయంలో మాట్లాడినట్లు వివరించాడు.బయటకు వెళుతూ 12 గంటలకు గదలోకి వెళ్లి చూడగా వంట గదిలో ఉరికి వేలాడుతూ కనిపంచాడు. రేకుల పైపుకు చీరతో ఉరివేసుకున్నట్లు గమనించి దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.ఈ మేరకు కేసునమోదు చేసుకుని ధర్యాప్తు చేస్నున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement