ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటుచేయాలని, ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్ సౌకర్యాన్ని రద్దు చేయాలనే డిమాండ్లతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటుచేయాలని, ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్ సౌకర్యాన్ని రద్దు చేయాలనే డిమాండ్లతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం మొదలైన నిరసనలు గురువారం కూడా కొనసాగాయి. న్యాయవాదులు విధులు బహిష్కరించి, నినాదాలు చేస్తున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు.