న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీజేపీ శాసనసభ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
వారసత్వ ఉద్యోగాల కల్పన విషయంలో సీఎం కేసీఆర్ తొందరపాటు నిర్ణయం, అనాలోచిత విధానాలతో కార్మికుల సమస్యలను మరింత జటిలం చేశారని విమర్శించారు. కార్మిక సంఘాల నేతలపై అక్రమకేసులు పెట్టి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. ఇది ప్రభుత్వ నియంతృత్వ విధానానానికి, దివాళాకోరుతనానికి నిదర్శనమని, కార్మికుల సమస్యల పరిష్కారంకోసం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు.