కేశవరెడ్డి విద్యాసంస్థల గుర్తింపు నిలిపివేయండి | Keshava Reddy institutions to refrain from recognition | Sakshi
Sakshi News home page

కేశవరెడ్డి విద్యాసంస్థల గుర్తింపు నిలిపివేయండి

Feb 16 2017 4:38 AM | Updated on Aug 31 2018 8:31 PM

కేశవరెడ్డి విద్యాసంస్థల గుర్తింపు నిలిపివేయండి - Sakshi

కేశవరెడ్డి విద్యాసంస్థల గుర్తింపు నిలిపివేయండి

కేశవరెడ్డి విద్యా సంస్థలకు 2017–2018 విద్యా సంవత్సరానికి గుర్తింపు నిరాకరించేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను

హైకోర్టులో విద్యార్థి తండ్రి పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: కేశవరెడ్డి విద్యా సంస్థలకు 2017–2018 విద్యా సంవత్సరానికి గుర్తింపు నిరాకరించేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించాలని కోరు తూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ విద్యార్థి తండ్రి షేక్‌ మహ్మద్‌ హుస్సేన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.రామలింగేశ్వర్‌రావు బుధవారం విచారించారు. కేశవరెడ్డి విద్యా సంస్థలకు చెందిన రూ.121 కోట్ల ఆస్తులను సీఐడీ జప్తు చేసిందని, న్యాయస్థానం అనుమతితో వాటిని వేలం వేసి, డిపాజిట ర్లకు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదిం చారు. 2017–2018 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇచ్చి ప్రవేశాలు కల్పిస్తే వేలం నిర్వహణకు అవరోధం కలుగుతుందన్నా రు. ఈ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, పాఠశాల విద్య కమిషనర్లకు న్యాయమూర్తి నోటీసులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement