స్వచ్ఛ తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: కేటీఆర్ | indo san 2016 swachh barath conference in ktr | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: కేటీఆర్

Oct 1 2016 2:21 AM | Updated on Sep 4 2017 3:39 PM

స్వచ్ఛ తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: కేటీఆర్

స్వచ్ఛ తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: కేటీఆర్

స్వచ్ఛ తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారకరామారావు తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారకరామారావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘ఇండో సాన్-2016’ స్వచ్ఛ భారత్ సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాల్లో పూర్తి స్థాయి స్వచ్ఛత సాధించడమే స్వచ్ఛ భారత్ కార్యక్రమ లక్ష్యమన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఆ దిశగా తెలంగాణ పురోగతి సాధిస్తోందని, రాష్ట్రంలో 17 పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జన లేని విధంగా తీర్చిదిద్దామని, అక్టోబర్ 2 నాటికి ఆ పట్టణాల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. కొన్ని జిల్లాలు, గ్రామాలు పూర్తి స్థాయి బహిరంగ మలమూత్ర విసర్జన లేనివిధంగా ఇప్పటికే సిద్ధమయ్యాయని చెప్పారు. మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.

Advertisement

పోల్

Advertisement