breaking news
swach telangana
-
స్వచ్ఛ తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారకరామారావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘ఇండో సాన్-2016’ స్వచ్ఛ భారత్ సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాల్లో పూర్తి స్థాయి స్వచ్ఛత సాధించడమే స్వచ్ఛ భారత్ కార్యక్రమ లక్ష్యమన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆ దిశగా తెలంగాణ పురోగతి సాధిస్తోందని, రాష్ట్రంలో 17 పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జన లేని విధంగా తీర్చిదిద్దామని, అక్టోబర్ 2 నాటికి ఆ పట్టణాల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. కొన్ని జిల్లాలు, గ్రామాలు పూర్తి స్థాయి బహిరంగ మలమూత్ర విసర్జన లేనివిధంగా ఇప్పటికే సిద్ధమయ్యాయని చెప్పారు. మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. -
స్వచ్ఛ హైదరాబాద్ పోలీస్ లోగో ఆవిష్కరణ
సాక్షి,హైదరాబాద్: ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’ కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా లోగో తయారు చేసింది. అదనపు డీజీపీ రాజీవ్ త్రివేది నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) 1,8 బెటాలియన్లు డీజీ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ ఈ లోగోను ఆవిష్కరించారు. అనంతరం డీజీపీ కార్యాలయంలో పోలీసు సిబ్బందిని 14 గ్రూపులుగా విభజించి ఆవరణలోని 14 ప్రాంతాల్లో శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ పోలీస్ శాఖ స్వచ్ఛందంగా గత ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమైందన్నారు.