కెమెరా ఆర్డర్‌ చేస్తే.. ఇటుక ముక్కలొచ్చాయ్‌! | If the order of the camera .. got brick ! | Sakshi
Sakshi News home page

కెమెరా ఆర్డర్‌ చేస్తే.. ఇటుక ముక్కలొచ్చాయ్‌!

Jul 25 2016 9:51 PM | Updated on May 25 2018 7:16 PM

పార్శిల్‌లో ఉన్న కెమెరా బ్యాగ్, ఇటుక, రాళ్లు - Sakshi

పార్శిల్‌లో ఉన్న కెమెరా బ్యాగ్, ఇటుక, రాళ్లు

ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్‌ చేస్తే ఇటుక, రాళ్లు డెలివరీ అయ్యాయి. రిసాలబజార్‌ సాయినగర్‌ నివాసి ప్రేమ్‌కుమార్‌ కుమార్తె ఏంజిల్‌ విట్‌నెస్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కంపెనీ అమెజాన్‌లో ఉద్యోగం చేస్తోంది.

అమెజాన్‌ ఉద్యోగికి ఛేదు అనుభవం

అల్వాల్‌: ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్‌ చేస్తే ఇటుక, రాళ్లు  డెలివరీ అయ్యాయి. రిసాలబజార్‌ సాయినగర్‌ నివాసి ప్రేమ్‌కుమార్‌ కుమార్తె ఏంజిల్‌ విట్‌నెస్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కంపెనీ అమెజాన్‌లో ఉద్యోగం చేస్తోంది. రూ. 35 వేల విలువ చేసే కెమెరాను తాను పని చేసే అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 20న బుక్‌ చేసింది.  ఈ నెల 24న ఆమెకు పార్శిల్‌ వచ్చింది. విప్పిచూస్తే ఖాళీ కెమెరా బాక్స్‌.. బ్యాగు అందులో ఇటుక, రాళ్లు దర్శనమిచ్చాయి. దీంతో కంగుతిన్న ఏంజిల్‌ అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డెలవరీ బాయ్‌కి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement