ఆంధ్రప్రదేశ్ రాజధానిని ముంబైకి రెండున్నర రెట్లు, సింగపూర్కు పది రెట్లు పెద్దదిగా కడుతున్నామని, ఇంత పెద్ద రాజధాని కడుతున్నప్పుడు మన దగ్గర సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఉందా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని ముంబైకి రెండున్నర రెట్లు, సింగపూర్కు పది రెట్లు పెద్దదిగా కడుతున్నామని, ఇంత పెద్ద రాజధాని కడుతున్నప్పుడు మన దగ్గర సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఉందా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. సింగపూర్, న్యూయార్క్ను మించిన రాజధానిని నిర్మిస్తున్నందుకు సంతోషమన్నారు.
'రాజధాని కోసం భూములు సేకరించాం, అందరి భవిష్యత్తు మన చేతిలో ఉంది. మన దగ్గర ఎంత డబ్బులున్నాయి, ఏం చేయదలచుకున్నాం, కేంద్రం ఏం చేస్తోంది? కొండవీటి వాగు పొంగితే 13వేల ఎకరాలు నీట మునుగుతుంది. ఒక నివేదిక ప్రకారం 1500 కోట్లు కేవలం 2 మీటర్ల ఎత్తు లేపడానికి అవుతుందని చెబుతున్నారు. తిరుపతిలో, సెక్రటేరియట్‌లో హుండీలు పెట్టడం లాంటివి చేస్తున్నారు. ఆన్లైన్లో ఇటుకలు, పిల్లల నుంచి విరాళాలు తీసుకుంటున్నారు. రాజధానికి నిధులు ఎలా సేకరిస్తారు?' అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.