లేటెస్ట్ టెక్నాలజీ తెలుసుకుందాం..రా!

లేటెస్ట్ టెక్నాలజీ తెలుసుకుందాం..రా! - Sakshi


హైటెక్స్‌లో గాడ్జెట్ ఎక్స్‌పో ప్రారంభం    

21వరకు ప్రదర్శన

   


 మాదాపూర్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గాడ్జెట్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ‘ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పో -2015’  ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో వివిధ రకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ప్రదర్శనలో 100 స్టాల్స్‌లో కెనాన్, మైక్రోమాక్స్, జియోని, పానసోనిక్, డబ్ల్యూడీసీ, మోటోరోల, వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈనెల  21వరకు ప్రదర్శన కొనసాగుతుంది.



  సెక్యూరిటీ బ్యాగ్

 మహిళలకు రక్షణ కలిగించే విధంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన బ్యాగ్ ప్రదర్శనలో ఆకట్టుకుంటోంది.  బ్యాగ్‌కు రెండు బటన్‌లు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే వాటిని ప్రెస్ చేయాలి. జీపీఎస్ సిస్టమ్ ద్వారా పోలీసులకు, ఆసుపత్రులకు, మహిళలకు రక్షణ కల్పించే  కార్యాలయాలకు సమాచారం వెళ్ళిపోతుంది. బ్యాగ్‌లోనే వివిధ రకాల స్ప్రేలు కూడా ఉంటాయి. ధర రూ. 1500



  ఆకట్టుకుంటున్న త్రీడీ ప్రింటర్

 మదిలోని ఆలోచనలను పేపర్ పై రాయడం పాత పద్ధతి.. ఇప్పుడు ఏకంగా త్రీడీలో ప్రింటింగ్ వేసుకోవడానికి ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయి.  త్రీడీ ప్రింట్‌ను భవన నిర్మాణ రంగంలో డిజైన్‌లను వేయడానికి,  విద్యార్థులకు వివిధ రకాల బొమ్మలు చూపించడానికి ఉపయోగించవచ్చు.  ప్లాస్టిక్, రబ్బర్, ప్రత్యేకమైన మెటల్స్‌ను వాడుకోవచ్చు.  ధర రూ. 45 లక్షల నుండి ప్రారంభం.



  ఎయిర్ ఫ్యూరిఫయర్

 నగరంలో గాలి కాలుష్యం అధికం.. దీంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు ఎయిర్ ప్యూరిఫయర్ ఉపయోగపడుతుంది. దీనిని గృహాలలో, పరిశ్రమలలో, పాఠశాలలలో, ఆఫీసులలో, ఆసుపత్రులలో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది.  ధర రూ. 25వేల నుండి ప్రారంభం.



  ఆకట్టుకుంటున్న ఎయిరోఫిక్స్

 ప్రస్తుతం వివాహాది శుభకార్యాలకు ఎయిరో ఫిక్స్ ను వాడుతున్నారు. హెలికాప్టర్ ఆకారంలో ఉండి దానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను అమర్చి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. వీటిని ముఖ్యంగా పబ్లిక్ ప్రాంతాలలో, సినిమాలు తీసేం దుకు, డాక్యుమెంటరీల కోసం, ఫొటోగ్రఫీ కోసం, వివాహాలు, రక్షణ  కొరకు వీడియోలను, ఫోటోలను తీసేందుకు ఉపయోగిస్తున్నారు. జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మొబైల్ రిమోర్ట్ ద్వారా ఆపరేటింగ్ చేయవచ్చు. ధర రూ. 1.25 లక్షల నుండి ప్రారంభం.



 ముచ్చటగొలిపే  బ్లూటూత్ ప్రింటర్స్

 స్పాట్ బిల్లింగ్ మిషన్స్, బ్లూటూత్ ప్రింటర్స్, టైం, అటెండెన్స్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈ టికెటింగ్, రిటైల్ బిల్లింగ్, పార్కింగ్ మేనేజ్‌మెంట్, టాక్స్ కలెక్షన్, కేబుల్ టీవీ బిల్లింగ్ లాంటి వాటికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి జీఎస్‌ఎం, జీపీఆర్‌ఎస్, సీడిఎంఎ మోడ్స్‌ను సౌకర్యాలు కలిగి ఉన్నాయి.  ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, కామన్ మీటర్ రీడర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 10 వేల నుండి ప్రారంభం.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top