
పెట్రోల్ పోయలేదని కర్రలతో దాడి : ఒకరి మృతి
హైదరాబాద్ నగరంలో బుధవారం అర్థరాత్రి దారుణం జరిగింది.
కూకట్‌పల్లి: హైదరాబాద్ నగరంలో బుధవారం అర్థరాత్రి దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు పెట్రోల్ పోయలేదని బంక్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్లితే....కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆరుగురు యువకులు పెట్రోల్ కోసం వచ్చారు. అప్పటికే పెట్రోల్ బంక్ మూసి వేశారు. మద్యం మత్తులో ఉన్న వారు పెట్రోల్ పోయాలంటూ గొడవకు దిగి బంక్ సిబ్బందిపై దాడి చేశారు. క్యాషియర్ సంఘమేశ్వర్, మేనేజర్ రాజులపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టి పరారయ్యారు. వీరి దాడిలో సంఘమేశ్వర్ అక్కడే మృతి చెందగా, రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని చికిత్స కోసం స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.