తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్రం జోక్యం చేసుకుని రైతు రుణాలు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్రం జోక్యం చేసుకుని రైతు రుణాలు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆయన తెలిపారు. సోమవారం ఆయనిక్కడ మాట్లాడుతూ పరిశ్రమలకు ప్రకటించినట్టుగానే వ్యవసాయానికి ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ టీడీపీ నేతలు ఊహల్లో విహరిస్తున్నారని, చంద్రబాబుని సమర్థించినంతకాలం వారికి ఇక్కడ ఆదరణ ఉండదని విమర్శించారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నివ్యతిరేకిస్తూ చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను ఉపసంహరించుకోవాలన్నారు. 3 లక్షల మంది గిరిజనులను ముంచి పోలవరాన్ని కడతామంటే సహించేదిలేదన్నారు. పోలవరం డిజైన్ మర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.