వివేకం: అవును! నేనే బాధ్యుడను! | As a Doctor, we should take the responsibility | Sakshi
Sakshi News home page

వివేకం: అవును! నేనే బాధ్యుడను!

Published Sun, Aug 18 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

వివేకం: అవును! నేనే బాధ్యుడను!

వివేకం: అవును! నేనే బాధ్యుడను!

ఒక డాక్టర్ కొత్తగా ప్రాక్టీస్ పెట్టాడు. అతను మంచి డాక్టర్ కావాలని చదివాడు. ఆయన దగ్గరకు ఒక పేషెంట్‌ను తీసుకొచ్చారు. కాస్త ఆలస్యం అయితే ప్రాణాలు పోయేలా ఉంది ఆ రోగి పరిస్థితి. అటువంటి స్థితిలో, మన డాక్టర్‌గారు రోగిని పరీక్షించి, కావలసిన చికిత్సలు చేశాడు. ఆ రోగి రెండు రోజుల్లో లేచి కూర్చోగలిగాడు.

ఒక డాక్టర్ కొత్తగా ప్రాక్టీస్ పెట్టాడు. అతను మంచి డాక్టర్ కావాలని చదివాడు. ఆయన దగ్గరకు ఒక పేషెంట్‌ను తీసుకొచ్చారు. కాస్త ఆలస్యం అయితే ప్రాణాలు పోయేలా ఉంది ఆ రోగి పరిస్థితి. అటువంటి స్థితిలో, మన డాక్టర్‌గారు రోగిని పరీక్షించి, కావలసిన చికిత్సలు చేశాడు. ఆ రోగి రెండు రోజుల్లో లేచి కూర్చోగలిగాడు.
 ‘‘ఈయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, నా దగ్గరకు తెచ్చారు. బాగా స్టడీ చేసి, కరెక్ట్‌గా ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకే బతికి బైటపడ్డాడు. నేనాయనకు ప్రాణం పోశాను ’’ అంటూ గొప్పలు చెప్పుకున్నాడు డాక్టర్.
 మరుసటిరోజు, ఆ డాక్టర్ దగ్గరికి అదే పరిస్థితిలో ఉన్న మరొక రోగి వచ్చాడు. మన డాక్టర్ అతడిని కూడా క్షుణ్నంగా పరీక్షించి ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. కాని ఆ రోగి చనిపోయాడు. ఇప్పుడు మరి ఈ డాక్టరేమంటాడు?
 ‘‘చూశారా! రోగిని పైలోకాలకు ఎంత బాగా పంపించానో!’’ అంటాడా? ‘ఇది దైవానుగ్రహం’ అనో, ‘రోగి తలరాత!’అనో లేక ‘తీసుకొచ్చిన బంధువులు కాస్త ఆలస్యంగా తెచ్చారు’ అనో, ఏదో చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు.
 మీరు ఏదో జరగాలనుకున్నారు. అనుకున్నట్లు జరిగితే దానికి మీరు బాధ్యత తీసుకుంటారు. లేదంటే ఎవరికి అంటగట్టాలా అని ఆలోచించి చివరకు ‘అస్తమానమూ మనం చెప్పేవన్నీ వినడానికి పైన ఒకడున్నాడు కదా!’ అని ఆయన మీదకు తోసేస్తారు.
 మీరొక పరీక్ష రాశారు. సులభంగా ఉంటే ‘చాలా బాగా రాశాను’ అంటారు. బాగా రాయలేకపోతే, ‘సమయం సరిపోలేదనో, సిలబస్‌లో లేనివి ఇచ్చారనో’ ఏవో కారణాలు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు. మీరు ఎందుకిలా చేస్తారు?
 గెలుపుకు వెంటనే బాధ్యత తీసుకునే మీరు, అపజయానికి ఎవరిని బాధ్యులను చేద్దామా అని వెతుక్కోవడం ప్రారంభిస్తారు. మీరనుకున్నట్లు జరగకపోయినా, దానిక్కూడా బాధ్యులు మీరేనా? కాదా?
 మీ సామర్థ్యానికి మీరే బాధ్యులైతే, సామర్థ్యం లేకపోవడానికి ఎవరు బాధ్యులు? మీరే కదా!
 జరగనిదానికి కూడా ‘నేనే బాధ్యుడను!’ అని మీరు తెలుసుకోగలిగితే, అది చేయగల సామర్థ్యం మీరు పొందగలరు.
 ‘‘రేపు నేనిలా ఉండాలి, నా జీవితం ఇలా అభివృద్ధి చెందాలి’ అని మీరు ఆశిస్తున్నారు. ఈ రోజు మీరున్న స్థితికి ‘నేను బాధ్యుడను’ అని ఒప్పుకోకపోతే, ఇక రేపెలా ఉండాలో మీరు ఎలా నిర్ణయించుకోగలరు?
 ‘ఇప్పుడు నేనెలా ఉన్నానో, దానికి పూర్తిగా నేనే బాధ్యుడను’ అని అర్థం చేసుకోగల నిజాయితీ ఉంటే తప్ప, రేపెలా ఉండాలి అని కలలు కనే హక్కు మీకుండదు.
 ఇప్పుడు నిజం చెప్పండి. ప్రస్తుతం మీ జీవన స్థితి బాగున్నా, బాగలేకపోయినా దానికి మీరే పూర్తి బాధ్యులా? కాదా?
 మీ సమాధానం ‘అవును. నేనే బాధ్యుడను’ అయితే, విజయపథంలో మీరు నిస్సందేహంగా ఒక అడుగు ముందుకు వేసినట్లే.
 
 సమస్య - పరిష్కారం
 నా తండ్రి చదువురాని ఒక బైతు. నా స్నేహితుల దగ్గర ఆయన మాట్లాడుతూంటే, నా గౌరవానికి భంగంగా ఉంది. ఆయనకు మర్యాదగా ఉండటం ఎలా నేర్పాలి?
 - జి.నగేష్, కాకినాడ
 సద్గురు: మీ తల్లిదండ్రుల వల్లనే మీరు జన్మనెత్తారనేది మర్చిపోతున్నారు. మన అభిరుచులకు సరిపోనివారు మనకెప్పుడూ మూర్ఖులుగానే గోచరిస్తారు. మిమ్మల్ని కూడా అదే రీతిలో భావించేవారు చాలామంది ఉన్నారని మర్చిపోకండి.
 మీరు పట్టణంలో చదివారు. ఏదో ఇంగ్లిషులో మాట్లాడగలుగుతున్నారు. కంప్యూటర్ వాడటం తెలుసుకున్నారు. అందువల్ల మీరు తెలివైనవారని అనుకుంటున్నారా?
 మీకు ఆవు పొదుగు నుండి వారిలా పాలు పితకడం వచ్చా? కాళ్లకు దెబ్బలు తగిలించుకోకుండా నాగలితో కనీసం అడుగు దూరం అయినా దున్నగలరా? మీరు వ్యవసాయం గురించి మహా అయితే పుస్తకం చదివి తెలుసుకొని ఉండవచ్చు. వారు భూమి నుండే చదివారు. వారిది స్వానుభవం, మీది అలా కాదు.
 తమ సంతానాన్ని తమ కంటే మెరుగైన స్థితికి తీసుకురావాలని మీకు పట్టణంలో విద్యను, వసతులను కల్పించినవారు బుద్ధిమంతులా లేక మీరు బుద్ధిమంతులా? కృతజ్ఞతతో వారిని బాగా చూడదలిస్తే, ఆప్యాయంగా మీకు ఉన్నవి, తెలిసినవి, నేర్చుకున్నవి వారితో పంచుకోండి.
 మీరొక స్టేటస్‌లో ఉన్నారు. ఎదుటివారు మరొక స్టేటస్‌లో ఉన్నారు. అంతే! దీంట్లో తెలివైనదీ, కానిదీ ఏమీ లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement