బోగస్ ఓట్లు, వ్యవస్థకు తూట్లు | Bogus Votes | Sakshi
Sakshi News home page

బోగస్ ఓట్లు, వ్యవస్థకు తూట్లు

Jan 23 2015 2:00 AM | Updated on Sep 2 2017 8:05 PM

మాడభూషి శ్రీధర్

మాడభూషి శ్రీధర్

ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ ఆధారమైతే, ఆ ఎన్ని కలకు ప్రాతిపదిక ఓటర్ల జాబి తా. ఎవరు ఓటరు, ఎవరు కా దు? ఒక పౌరుడికి ఒక్క ఓటే ఉండాలి.

 విశ్లేషణ
 ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ ఆధారమైతే, ఆ ఎన్ని కలకు ప్రాతిపదిక ఓటర్ల జాబి తా. ఎవరు ఓటరు, ఎవరు కా దు? ఒక పౌరుడికి ఒక్క ఓటే ఉండాలి. అంటే ఒకే ఓటరు గుర్తింపుకార్డు ఉండాలి. అర్హత లు, వయసులను బట్టి; పౌర సత్వం, నివాసం, వయసు, ధృవీకరణల ఆధారంగానే ఓటరు కార్డు ఇవ్వాలి. చట్టాలూ, నిబంధనలు ఇదే చెబుతున్నాయి.

 అయినా ఒక్కొక్కరికి రెండు మూడు కార్డులు ఎలా వస్తున్నాయి?  ఒకే వ్యక్తికి  రెండు వేరే నియోజకవర్గా లలో, లేదా రెండు రాష్ట్రాలలో ఓటరు కార్డులు ఏ విధం గా ఇస్తారు? ఇటువంటివి ఎన్ని? దీని మీద ఫిర్యాదులు ఉన్నాయా? ఎవరైనా పరిశోధించారా? ఈ రకం అన్యా యాలను ఆపలేమా? అనేవి సామాన్యుని ప్రశ్నలు. అవే ఆర్‌టీఐ రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ ప్రశ్నలకు సబ్ డివిజినల్‌మెజిస్ట్రేట్ సమాధానం చెప్పాలని అనిల్ సూద్ అనే న్యాయవాది  సమాచార హక్కు చట్టం కింద డిమాండ్ చేశారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక నియోజక వర్గంలో స్త్రీ,పురుషులు,  పక్కా నివాసం చిరు నామా ఇచ్చిన వారు, నివసిస్తున్న ఇల్లు కాక, మరొక ఇంటి చిరునామా ఇచ్చినవారు-ఇలా ఎందరికి ఓటరు కార్డులు ఇచ్చారో వెల్లడించాలని ఆయన కోరారు. అయి తే వీటిలో చాలా అంశాలు సమాచారం కిందికే రావనీ, సమాచార హక్కు చట్టంసెక్షన్ 2(ఎఫ్) కింద సమాచా రం కాని అంశాలకు సమాధానం చెప్పనవసరం లేదని అధికారులు వాదించారు. మరోవైపు ఈ సమాచారం ఇవ్వడానికి రూ.7,922 రుసుము చెల్లించాలని సూచిం చారు.  అడిగిన సమాచారాన్ని మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా ఇవ్వలేదని అనిల్ రెండో అప్పీలు దాఖలు చేశారు. పిఐఓ రూ.7,922  అడగడం, పై అధికారి ఆ డబ్బు చెల్ల్లించాలని ఆదేశించడం ఏకపక్ష నిర్ణయాలే. ఆదేశంలో మొదటి అప్పీలు అధికారి కారణాలు వివరిం చకపోవడం కూడా అన్యాయం, చట్టవిరుద్ధం.  

 ఎంపీ, ఎమ్మెల్యే లేదామునిసిపల్ కౌన్సిలర్ గారో సంతకం చేసి, ఫలానా వ్యక్తి ఫలానా చోట ఉంటున్నా డని ధృవీకరిస్తే, వెంటనే ఓటరు కార్డు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఈ విధంగా రాజకీయ ప్రజా ప్రతినిధులు, పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల సభ్యులు ధృవీకరిస్తూ  వెళ్తే  నకిలీ కార్డులు ఏ విధంగా రాకుండా ఉంటాయి అన్నది అనిల్ ఆరోపణ. ఒక ఓటరు ఫలానా చోట ఉంటున్నాడని, లేదా నివసించడం లేదని ఏ విధంగా రుజువుచేస్తారు? ఇది అబద్ధం కాదని, లేదా నిజమేనని ఎంపీ, ఎమ్మెల్యే  ఏ విధంగా రుజువు చేస్తారు? ఓటరు కార్డు మంజూరు చేసేందుకు ఇవే అర్హతలుగా నిర్ణయించారా? అన్నది మౌలిక ప్రశ్న. ఇటువంటి కార్డులతో జరిగే ఎన్నికలు స్వేచ్ఛాయు తంగా, న్యాయంగా జరిగినవే అవుతాయా అని అనిల్ సవాలు చేశారు. తన ప్రశ్నలకు జవాబిస్తే ఒక నియోజ కవర్గంలో ఎన్ని బోగస్ కార్డులు ఉంటాయో తేలిపో తుందని ఆయన వివరించారు.

  దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరుగుతున్నందున ఓటర్ జాబితా సరిగ్గా ఉందా, లేదా? అనే విషయం ప్రాధాన్యం సంతరించు కుంది. అంతేకాదు, ఢిల్లీలో వేలకొద్దీ బోగస్ ఓటరు కార్డులు ఉన్నాయని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీ హైకోర్టు ముందు ప్రమాణ పత్రం ద్వారా అంగీకరిం చారు. తప్పుడు ఫొటోలు పెట్టి 58 వేల మంది కార్డులు తీసుకున్నారని, మామూలు పౌరుడి ఓటరు కార్డు మీద ఒక సినిమా స్టార్ ఫొటో ఉందంటే బోగస్ కార్డులు ఎంత సులువుగా ఇస్తున్నారో అర్థమవుతుంది.

 సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం, మొదటి అధికారి ఆదేశాన్ని కూడా మన్నించకపోవడం సమాచార హక్కు సెక్షన్ 20 కింద జరిమానాతో శిక్షించ తగిన వివాదాలు అవుతాయి. ఈ విషయమై కారణాలు వివరించాలని నోటీసు జారీ చేయాల్సిందే. ఇన్ని బోగస్ కార్డులున్నాయనే అనుమానం బలంగా ఉన్న తరువాత, ప్రధాన అధికారి స్వయంగా ఒప్పుకున్న తరువాత నివా స ధ్రువీకరణ వివాదాల వల్ల బోగస్ కార్డులు ఉన్నాయో లేదో సమగ్రంగా విచారించాల్సిన అవసరం, ఇంకా సవ రణలకు వీలున్నందున సవరించే అవకాశాలు వదులు కోక,వినియోగించుకోవడం చాలా అవసరం.
 (అనిల్‌సూద్ వర్సెస్ ఎస్‌డీఎం (ఎన్నికలు)  ఢిల్లీ ప్రభుత్వం కేసులో  ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement