ఒక పఠాన్ రక్త కన్నీరు!

ఒక పఠాన్ రక్త కన్నీరు!


కన్నీరులో ఆనందపు ఆర్ణవాలుంటాయి. విషాద సముద్రాలూ ఉంటాయి. కన్నీటిని ఎవ్వరు నిర్వచించగలరు? తన ఉపన్యాస కళ ద్వారా  వ్యక్తులనే కాదు, సమూహాలనూ కంటనీరు పెట్టించిన ఒక వ్యక్తిత్వంలోకి తొంగి చూద్దామా?!

 

చాదర్‌ఘాట్ సమీపంలోని విక్టరీ ప్లే గ్రౌండ్. 1930 నవంబర్. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా సభ. ఓ యువకుడు ప్రసంగిస్తున్నాడు. శ్రోతలు పరవశులై ఉన్నారు.




అకస్మాత్తుగా పోలీసుల విజిల్స్. హడావుడి. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనూహ్యంగా ఆగమించారు! ఆ యుువకుడు ఒక్క క్షణం సంభాళించుకుని అప్పుడే వచ్చిన వ్యక్తిని (నిజాం) ఉద్దేశించి ‘మహ్మద్ ప్రవక్తకు కిరీటధారి అయిన సేవకుడా! భౌతిక-ఆధ్యాత్మిక ప్రపంచాలకు చక్రవర్తి అయిన భగవంతుని పాలనా రీతులను ఆలకించు..’ అంటూ ఉపన్యాసాన్ని పునః ప్రారంభించాడు. ఆ వూటలకు కన్నీటితో తడవని వ్యక్తి ఒక్కరూ లేరు! నిజాంతో సహా! వారం తర్వాత నవంబర్ 25న ‘నిజాం తన జన్మదినం సందర్భంగా మీ ప్రవచనాలను వినాలనుకుంటున్నారు, తమరికి ‘బహదూర్ యార్ జంగ్’ బిరుదును ప్రదానం చేద్దామనుకుంటున్నారు’ అని ఆ యువకునికి ఫర్మానా అందింది! ఇంతకీ ఎవరతడు? నిజాం సికిందర్ జా (1903-29) హయాంలో హైద్రాబాద్ తరలి వచ్చిన పఠాన్ కుటుంబీకుడు. నసీబ్‌ఖాన్ తనయుుడు నిసార్ అహ్మద్ (సాదీ) ఖాన్. 1905లో మార్చి 4న నగరంలో జన్మించాడు. పుట్టిన ఏడవ రోజునే తల్లిని కోల్పోయి అమ్మమ్మల-నానమ్మల పోషణలో పెరుగుతూ మదర్సా-ఎ-అలియా, దారుల్-ఉలూమ్‌లలో చదువుకున్నాడు. 1923లో తండ్రి చనిపోయాడు. వారసత్వంగా నిజాం అసంఘటిత సైన్యాధిపత్యం, జాగీర్ లభించాయి. 1927లో ఇస్లాం ప్రచారసంస్థను నెలకొల్పాడు.



నాలుగు దశాబ్దాలుగా వుృతప్రాయంగా ఉన్న జాగీర్దార్ల సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికై  జవసత్వాలను నింపాడు. అల్పసంఖ్యాకులైన మహదవీ శాఖకు చెందిన బహదూర్ యార్ జంగ్ అన్ని శ్రేణుల ముస్లింలను ఏకం చేశాడు. బహదూర్ ఖాన్ గొప్ప చదువరి. తెలుగులో కనీస పరిజ్ఞానం, ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్‌లపై పట్టున్నవాడు. జిన్నా ఇంగ్లిష్ ఉపన్యాసాలను ఉర్దూలోకి అనువదించేవాడు. ‘మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్-ముసల్మీన్’ అనే సాంస్కృతిక-మత సంస్థకు 1938లో అధ్యక్షుడయ్యాడు. ఈ సంస్థ తర్వాత ముస్లింలీగ్‌లో విలీనమైంది.



అందులోనూ ఎదురులేని నేత!

అప్పటి హైద్రాబాద్ ప్రత్యేక రాజకీయ పరిస్థితిని బహదూర్ తన దృక్కోణంతో సమీక్షించుకున్నాడు. 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ చక్రవర్తి 14వ లూయూ వూదిరిగా నిజాం కూడా ‘నేనే రాజ్యాన్ని (అయామ్ ద స్టేట్)’ అనే ధోరణిలో ఉన్నాడు.  నిజానికి నిజాం బ్రిటిషర్ల వీర విధేయుడు!  ఈ నేపథ్యంలో ప్రతి ముస్లిం కూడా ప్రభువే (అనల్ మాలిక్), నిజాం ముస్లింలకు ప్రతీక మాత్రమే అనే సిద్ధాంతాన్ని బహదూర్ యార్‌జంగ్ వ్యాప్తిచేశాడు. హైద్రాబాద్‌ను స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ప్రకటించాలని నిజాంపై ఒత్తిడి తెచ్చాడు. మత మార్పిడులను ప్రోత్సహించాడు.



ఫలితంగా రజాకార్లు చెలరేగారు. ప్రతిగా వామపక్షవాదులు, ఆర్యసమాజీకులు, కాంగ్రెస్ వాదులు తమ కార్యకలాపాలను ఉధృతం చేశారు.  యార్‌జంగ్ ధోరణి నిజాంను అసహనానికి గురిచేసింది. బ్రిటిషర్లకు ఆగ్రహాన్ని కలిగించింది. జాగీ ర్దార్లు రాజకీయాల్లో పాల్గొనరాదనే నిబంధనను బ్రిటిషర్ల ఒత్తిడితో నిజాం గుర్తుచేశాడు. జాగీర్‌ను తిరస్కరించి, నిజాం కంటే బలవంతునిగా ఆవిర్భవించాడు! బహదూర్ యార్‌జంగ్‌కు హైకోర్టు జడ్జి హషీం అలీఖాన్ సన్నిహితుడు. 1944లో జూన్ 25న యార్‌జంగ్‌ను విందుకు ఆహ్వానించాడు.



కాస్త ఆలస్యంగా వెళ్లిన యూర్‌జంగ్ అలా కూర్చున్నాడు. హుక్కా అందుకున్నాడు. అంతే! కుప్పకూలాడు!  నిజాం ప్రోద్బలంతోనే ఇలా జరిగిందని కొందరు చెవులుకొరుక్కున్నారు. మరునాటి ఉదయం బహదూర్ యార్‌జంగ్ అంతివుయాత్రలో  నిజాం కూడా పాల్గొన్నాడు. రాజకీయాలకు అతీతంగా బహదూర్ ఎందరికో స్నేహితుడు. సాదత్ హసన్ మంటో ‘మేరా సాహెబ్’ అన్నాడు. సరోజినీ నాయుడు ‘మేరా బేటా’ అనేవారు! నివాళిగా ‘ద పఠాన్’ అనే కవిత రాశారు!

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top