సమ్మర్‌ టిప్స్‌

Summer tips for skin - Sakshi

ఎండతో చర్మం జిడ్డుగా ఉందా?

ముందు వెచ్చని నీటితో తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల స్వేద గ్రంధుల జిడ్డు, తద్వారా మురికి తొలిగి చర్మకాంతి తగ్గకుండా ఉంటుంది.
దూది ఉండతో క్లెన్సింగ్‌ మిల్క్‌ను ముఖమంతా రాసి తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చే స్తే స్వేదగ్రంధులు చక్కగా శుభ్రపడతాయి. ముఖ చర్మం జిడ్డుగా మారదు
జిడ్డు తొలగిపోవాలని స్క్రబ్‌తో ముఖాన్ని ఎక్కువగా రుద్దకూడదు. వారానికి 2 సార్లు స్క్రబ్‌ చేస్తే మృతకణాలు, బ్లాక్‌హెడ్స్‌ తగ్గుతాయి. నూనెలు, ఇతర మాయిశ్చరైజర్‌ క్రీమ్‌లను ఈ కాలం ఉపయోగించకపోవడమే మేలు
♦  ముల్తానా మిట్టి లేదా గంధం పొడి వారానికి ఒకసారి ప్యాక్‌లా వేసుకొని ఆరాక శుభ్రపరుచుకోవాలి. దీంతో అదనపు జిడ్డు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది
♦  ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి ముందు టిష్యూ ప్యాడ్‌తో తుడవాలి. ఇలా చేయడం వల్ల అదనపు జిడ్డు సులువుగా వదిలిపోతుంది. నేరుగా చెయ్యి ముఖానికి తగలడం వల్ల మొటిమలు, యాక్నె సమస్య పెరుగుతుంది
♦  ఈ కాలం వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల జిడ్డు సమస్య పెరుగుతుంది. విటమిన్‌ –ఎ అధికంగా ఉండే క్యారట్, ఆకుకూరలు, తాజా పండ్లు తినాలి
♦  రోజూ 2–4 లీటర్ల నీళ్లు తప్పక తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు సమస్య బాధించదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top