'ఈనాడు-టీడీపీలపై తక్షణమే చర్యలు తీసుకోండి' | ysrcp complaints to election commission for eenadu | Sakshi
Sakshi News home page

'ఈనాడు-టీడీపీలపై తక్షణమే చర్యలు తీసుకోండి'

Apr 19 2014 5:59 PM | Updated on Aug 10 2018 8:06 PM

ఈనాడు, టీడీపీలు కుమ్మక్కయ్యాయని వైఎస్సార్ సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్:ఈనాడు, టీడీపీలు కుమ్మక్కయ్యాయని వైఎస్సార్ సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలపై బురద చల్లేందుకు ఈనాడు పత్రికను టీడీపీ వాడుకుంటోందని ఈసీకి వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. పాంచజన్య పేరుతో ఎన్నికల స్పెషల్ పేజీల్లోని వార్తలు ఓటర్లును ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆ ఫిర్యాదులో వైఎస్సార్ సీపీ పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో పాటు జగన్ పై బురదచల్లేందుకు ఈనాడు పత్రిక-టీడీపీలు కలిసి వార్తలు ప్రచురిస్తున్నాయని తెలిపింది.

 

విచారణలో ఉన్న కేసులను ప్రచురించకూడదన్న నిబంధనను ఈనాడు ఉల్లంఘిస్తుందని వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ కె.శివకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement