
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా...
తమ పార్టీ మేనిఫెస్టోను అతిత్వరలో విడుదల చేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు.
హైదరాబాద్: తమ పార్టీ మేనిఫెస్టోను అతిత్వరలో విడుదల చేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టోగా ఉంటుందని వెల్లడించారు. మేనిఫెస్టోపై పార్టీ సీనియర్ నేతల కసరత్తు పూర్తవుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో ఉంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని ఎవరూ నమ్మడం లేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు బాబు చేస్తున్న హడావిడి చూస్తుంటే జాలేస్తుందన్నారు. కాంగ్రెస్ లీడర్లకు పునరావాస కేంద్రంగా టీడీపీ మారిందన్నారు.