
అందరికీ భరోసా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రకటిం చిన ఎన్నికల మేనిఫెస్టో అన్నివర్గాలను ఆకట్టుకుంది.
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రకటిం చిన ఎన్నికల మేనిఫెస్టో అన్నివర్గాలను ఆకట్టుకుంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కాలనుకునే రాబందుల రెక్కలు విరి గేలా ఈ మేనిఫెస్టో ఉందని వివిధ వర్గాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇంతకు ముందెన్నడూ దేశంలో ఎవరూ ఆలోచించని రీతి లో.. ప్రజలకు మహోపకారం చేసేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను రూపొందించారని అభిప్రాయపడ్డారు.
ప్రయోజనం ఇలా...
జిల్లాలో దాదాపు 80శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారికి వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రూ.2 వేల కోట్లతో ప్రత్యే క నిధిని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇవ్వడం రైతులకు భరో సా ఇచ్చేలా ఉంది. ఇది అమల్లోకి వస్తే ఆత్మహత్యలు ఉండవని అన్నదాతలు పేర్కొంటున్నారు. సమస్యల్లో ఉన్న రైతులు 102కు ఫోన్‌చేస్తే వారి ముంగి టకు సలహాలిచ్చి ఆదుకునే యంత్రాం గం రానుంది. బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న జిల్లాలోని దాదాపు రెండు లక్షల మంది రైతులు విద్యుత్ కోతలతో పంటలు కోల్పోతున్నారు. వ్యవసాయూనికి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినవిధంగా పూర్తిగా ఉచిత విద్యు త్ ఇవ్వడంతోపాటు పగటిపూట సరఫరా చేస్తామని ప్రకటించడం ద్వారా రైతులకు భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రాన్ని చూస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ చెప్పిన దానిని బట్టి చూస్తే తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం పునరుద్ధరణ జరిగే అవకాశాలున్నాయి.
పేదల ఇళ్లకు డాక్యుమెంట్లు
జిల్లాలో చాలా పేద కుటుంబాలకు సొంత గూడు లేదు. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు పొందిన వారికి ఇళ్లల్లో నివాసం ఉండటం మినహా దానిపై హక్కులేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల ఇళ్లకు పక్కా డాక్యుమెంట్లు ఇవ్వడంతోపాటు ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు కూడా లభిస్తాయి. మరోవైపు ఏ కార్డు కావాలన్నా 24 గంటల్లో జారీచేసే యంత్రాంగాన్ని రూపొందిస్తామనే నిర్ణయం సాహసోపేతమైనదని పలువురు పేర్కొంటున్నారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసి స్థాని కుల్లో పదిమంది మహిళలకు దాని బాధ్యతలు అప్పగిస్తారు. ఆ గ్రామం లో వారే పోలీసులు. ఉద్యోగులకు అత్యుత్తమ పీఆర్‌సీతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరి సర్వీసును రెగ్యులరైజేషన్ చేస్తామంటున్నారు. ఇదే జరిగితే జిల్లాలో ఒక్క విద్యుత్ శాఖలోనే దాదా పు 660 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలు బాగుపడతాయి.
ఆరోగ్యశ్రీకి జవసత్వాలు
పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల మెట్టు ఎక్కేలా చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించనున్నారు. ఆపరేషన్ అనంత రం రోగి విశ్రాంతి తీసుకున్నంత కాలం నెలకు రూ.3 వేలు ఇస్తారు. పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పన, వైద్యం, విద్య, సేవా రం గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా పారదర్శక పాలన అందిస్తామని వైఎస్సార్ మేని ఫెస్టోలో స్పష్టం చేసింది. అవినీతిలో కూరుకుపోయిన జిల్లాలోని కొందరు అధికారుల వల్ల జనం పడుతున్న కష్టాలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది.
పిల్లల భవిష్యత్‌కు భరోసా
‘అమ్మఒడి’ పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలకు రూ.500 చొప్పున తల్లి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయడం, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకం కింద పూర్తి ఫీజు చెల్లించే ఏర్పాటు వంటి పథకాలు విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వనున్నారుు. ఉద్యోగ, ఉపాధి కల్పించే విషయంలోనూ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో యువతలో ధైర్యాన్ని నింపింది. వృద్ధులకు రూ.700 పింఛన్ చెల్లించడం ద్వారా వారికి మనోధైర్యాన్ని ఇవ్వనుంది. డ్వాక్రా రుణాలు రద్దు చేయడం ద్వారా మహిళల మోములో చిరునవ్వులు చూడనున్నారు. నియోజకవర్గంలో ఒకచోట మాత్రమే మద్యం అమ్మకం, వంట గ్యాస్‌పై రూ.100 సబ్సిడీ ద్వారా పేదల బతుకుల్లో వెలుగులు నిండుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేసిందనే అభిప్రాయం అందరినుంచి వ్యక్తం అవుతోంది.