
సామాన్యుని మేలుఫెస్టో
అమ్మఒడి’తో చిన్నారులు, వారి తల్లిదండ్రులకు కొండంత భరోసా. జిల్లాకో యూనివర్సిటీ ప్రకటనతో విద్యార్థుల్లో కొండంత ఆనందం. గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు
‘అమ్మఒడి’తో చిన్నారులు, వారి తల్లిదండ్రులకు కొండంత భరోసా. జిల్లాకో యూనివర్సిటీ ప్రకటనతో విద్యార్థుల్లో కొండంత ఆనందం. గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు అన్న హామీతో గ్రామీణుల కళ్లలో ఆనందం. డ్వాక్రా రుణాల రద్దు మాటతో ఆడ పడుచుల్లో కొండంత సంతోషం. పింఛన్ పెంపుపై వికలాంగులు, వృద్ధులు, వితంతువుల్లో ఎన్నో ఆశలు. ఇలా అన్ని వర్గాల ఆశలనూ తీర్చేలా... అందరినీ సంతోష పెట్టేలా... సామాన్యుడి పెదాలపై చిరునవ్వు తొణికిసలాడేలా... ఒక్క మాటలో చెప్పాలంటే రాజన్న రాజ్యాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చేలా వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టో రూపొందింది. ఈ మేనిఫెస్టోపై ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. జగన్‌మోహన్ రెడ్డి వినూత్న ఆలోచనలతో రాష్ర్ట భవిష్యత్ బంగారమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
విద్యుత్ అవస్థలు తప్పుతాయి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 150 యూనిట్ల విద్యుత్ వినియోగానికి కేవలం వంద రూపాయల చార్జీ మాత్రమే వసూలు చేస్తామనడం సంతోషించదగ్గ విషయం. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లో ఎప్పటికప్పుడు పెంచిన విద్యుత్ చార్జీలతో నా నా బాధలు పడ్డాం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆ బాధలు తప్పుతాయి. అలాగే విద్యుత్ సరఫరాలో కూడా లోటుపాట్లును నివారిస్తామనడం మంచి విషయం.
ముడిమంచి రామారావు, నెల్లిమర్ల
రైతుల కష్టాలు తీరినట్లే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు పెద్ద పీట వేయడంతో ఇకపై మా కష్టాలు తీరినట్లే. ఇప్పటికే పండించిన పంటకు సైరె న గిట్టుబా టు, మద్దతు ధర లేక వ్యవసాయం దండగ అనే స్థితికి చేరుకున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రైతుల కోసం రూ. 3 వేల కోట్ల వ్యవసాయ స్థీరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామనడం మంచి పరిణామం. అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 102, పాడి రైతుల కోసం 103 సేవలను ప్రవేశపెడతామని చెప్పడం కూడా శుభపరిణామం.
బూడి నారాయణప్పడు,రైతు, మొయిద.
వృద్ధులకు వరం
వృద్ధుల కోసం నియోజకవర్గానికి ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తానని మేనిఫెస్టోలో పెట్టడం వృద్ధులకు ఒక వరమే. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వృద్ధుల కోసం ప్రతినెలా ఠ ంఛన్‌గా పింఛను అందించేవారు. అంతకన్నా చాలా అభినందించదగ్గ కార్యక్రమం వృద్ధులకు ఆశ్రయం కల్పించడం.
మువ్వల శంకరరావు,
రైతు, పార్వతీపురం
వృద్ధులకు ఆసరా
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొనడం శుభపరిణామం. ఇప్పటివరకు ఇంత మొత్తంలో ఏ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ నిర్ణయం వల్ల వృద్ధులు, వికలాంగులకు ఆర్థికంగా భరోసా లభిస్తుంది.
గుమ్మిడి గురునాథరావు,
వికలాంగుడు, ఎల్. కోట మండలం
జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పేదలకు వరం
వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రసంశనీ యం. జిల్లాకొక సూపర్‌స్పెషాలి టీ హాస్పిటల్ నిర్మాణం అభినందనీయం. దీని వల్ల పేద ప్రజలు ఖరీదైన వైద్యం కో సం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి మేనిఫెస్టో గతంలో ఎప్పుడూ లేదు.
గంటా రామకృష్ణ,
వ్యాపారవేత్త, పార్వతీపురం
కార్యాలయూల ఏర్పాటు యోచన భేష్
ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ కార్యాలయూలు ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన కార్డులను 24 గంటల్లో అక్కడే జారీ చేస్తామన్న ఆలోచన ఎంతో గొప్పది. దీని వల్ల వివిధ కార్డుల కోసం వృద్ధులు, మహిళలు. విద్యార్థులు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఈ హామీ మంచి పరిణామం. అటువంటి నాయుకుడ్ని ముఖ్యమంత్రి చేస్తే ప్రజలు సుఖపడతారు.
బొండువాసు, మక్కువ
్ఠడ్వాక్రా రుణాల మాఫీతో
మహిళలకు మేలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ము ఖ్యమంత్రి అయితే మహిళల డ్వా క్రా రుణాలు మాఫీ చేస్తామనడం ఒక వరమే. చిన్న చిన్న కూలి పను లు చేసుకొని, కుటుంబ పోషణ చేసుకోవడమే కష్టంగా ఉంది. డ్వాక్రా రుణాలు చెల్లించేందుకు ఇబ్బంది పడా ల్సి వస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హర్షణీయం.
బోనెల మేరమ్మ,
డ్వాక్రా మహిళ, తెర్లాం
‘అమ్మఒడి’ అద్భుతం
మేనిఫెస్టోలో పేర్కొన్న అమ్మఒడి పథ కం వల్ల బాల కార్మికులు తగ్గే అవకా శం ఉంది. ప్రతి పిల్లాడికి చదివే అవకా శం కలుగుతుంది. ఇది మంచి ఆలోచ న. ఈ పథకం సమాజాభివృద్ధికి దోహ ద పడుతుంది.అలాగే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుంది.
-బూర్లి వెంకయ్యప్పలస్వామి, విద్యార్థి, గుర్ల