అనపర్తిలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు | TDP Activists demand Anaparthi seat to Nallamilli Rama Krishna Reddy | Sakshi
Sakshi News home page

అనపర్తిలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు

Apr 15 2014 12:02 PM | Updated on Aug 14 2018 4:21 PM

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.

అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. అనపర్తి అసెంబ్లీ సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. నల్లమిల్లి టిక్కెట్ ఇవ్వకుంటే  మూకుమ్మడి రాజీ నామాలు చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. అనపర్తి మండల అధ్యక్షుడు కర్రి ధర్మారెడ్డితో సమావేశమైన తెలుగు తమ్ముళ్లు ఈ మేరకు హుకుం జారీ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తుండడంతో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు స్థానిక నేతలు కలవరపడుతున్నారు. అనపర్తి అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.ముక్తేశ్వరరావు పోటీ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement